News March 17, 2026
HYD: అమ్మలకు ఏమైంది..!

కన్నబిడ్డకు కష్టం రాకూడదని కంచు కవచంలా నిలిచే తల్లే ఇప్పుడు కర్కశంగా మారుతున్న ఘటనలు కలవరపెడుతున్నాయి. పసి మోములపై ప్రేమ చల్లాల్సిన చేతులే ప్రాణాలు తీస్తున్నాయి. FEB 24న బౌరంపేటలో 2 నెలల పసివాడిని తల్లి కట్టెల పొయ్యిలో కాల్చి హతమార్చింది. తాజాగా గోల్కొండలో 14 నెలల చిన్నారిని ఊపిరాడనీయకుండా చేసి చంపింది. తల్లితనమే ప్రశ్నార్థకమవుతున్న ఈ ఘటనలు సమాజాన్ని కలచివేస్తున్నాయి.
Similar News
News March 17, 2026
పూజా సమయంలో ఏ రంగు దుస్తులు ధరించాలి?

పూజలో మనస్సును ప్రశాంతంగా ఉంచే సాత్విక రంగుల దుస్తులు ధరించడం శ్రేయస్కరం. సానుకూలతనిచ్చే పసుపు రంగు విష్ణుమూర్తికి ప్రీతికరం. తెలుపు పరిశుద్ధతకు, శాంతికి ప్రతీక. శివారాధనలో తెలుపు, శక్తి పూజల్లో ఎరుపు, గులాబీ ధరించడం ఉత్తమం. ఉదయం పూజకు పసుపు, తెలుపు రంగులు ఉత్తమం. అయితే, శని పూజలో మినహా నలుపు నిషిద్ధం. ముదురు నీలం రంగులను కూడా వాడకపోవడమే మంచిది. ఉతికిన శుభ్రమైన కాటన్ దుస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి.
News March 17, 2026
పాక్ మిలిటరీ హత్యలకు పాల్పడుతోంది: అఫ్గాన్ క్రికెటర్లు

తమ దేశంలోని ఆస్పత్రిపై పాకిస్థాన్ <<19403539>>వైమానిక దాడి<<>> చేయడాన్ని అఫ్గానిస్థాన్ క్రికెటర్లు ఖండించారు. రంజాన్ మాసంలో పాక్ మిలిటరీ హత్యలకు పాల్పడుతోందని రషీద్ ఖాన్, నబీ మండిపడ్డారు. ఆస్పత్రులు, స్కూళ్లు, గృహాలపై దాడి చేయడం వార్ క్రైమ్ అని పేర్కొన్నారు. ఈ ఘటనపై UN దర్యాప్తు చేసి నేరస్థులకు శిక్ష విధించాలని కోరారు. పాక్ దాడిలో దాదాపు 400 మంది మరణించారు.
News March 17, 2026
గవర్నర్ ప్రసంగంలో ఆదిలాబాద్ AIRPORT ప్రస్తావన

ఆదిలాబాద్ AIRPORT నిర్మాణంలో కీలక అడుగు ముందుపడింది. అసెంబ్లీ సమావేశాల్లో స్వయంగా గవర్నర్ తన ప్రసంగంలో AIRPORT పై ప్రసంగించడంతో జిల్లా వాసుల ఆశలు మరింత రెట్టింపు అయ్యాయి. AIRPORT ఏర్పాటు ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించిందని.. పనుల వేగవంతానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. జూన్ 2న ప్రధాని మోదీ చేతులమీదుగా శంకుస్థాపన చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.


