News November 9, 2025
HYD: అమ్మాయిలతో అసభ్యంగా రీల్స్.. జాగ్రత్త!

SMలో పిచ్చి పిచ్చి రీల్స్ పోస్ట్ చేసేవారిపై HYD పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా యువతితో రొమాన్స్ చేస్తూ ఆటో నడిపిన ఘటనపై చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పబ్లిక్ ప్లేస్‌లో అసభ్యకరమైన చేష్టలతో రీల్స్ చేసి SMలో అప్‌లోడ్ చేస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. పబ్లిక్‌లో పరువు పోయేలా వికృత రీల్స్ చేసి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్, కోర్టు మెట్లు ఎక్కించకండి. SHARE IT
Similar News
News November 9, 2025
5 రాష్ట్రాల్లో రూ.95 కోట్ల స్కామ్స్.. 81 మంది అరెస్ట్

TG: సైబర్ నేరగాళ్లపై రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉక్కుపాదం మోపుతోంది. AP, TN, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకలో ఆపరేషన్ చేపట్టి 81 మంది నిందితులను అరెస్ట్ చేసింది. వీరిపై 754 కేసులున్నాయని, రూ.95 కోట్ల విలువైన మోసాలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. వారి నుంచి 84 ఫోన్లు, 101 సిమ్‌లు, 89 బ్యాంక్ పాస్ బుక్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితుల ఖాతాల్లోని రూ.కోట్ల నగదును ఫ్రీజ్ చేశామన్నారు.
News November 9, 2025
ఏలూరులో జాతీయ న్యాయ సేవా దినోత్సవం

జాతీయ న్యాయ సేవా దినోత్సవ కార్యక్రమం ఆదివారం ఏలూరు కోర్టు ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగంలోని 39ఏ అధికరణం ప్రకారం, దేశంలోని ప్రతి పౌరుడికి న్యాయం అందుబాటులో ఉండాలని, ఆర్థిక లేదా ఇతర బలహీనతల కారణంగా ఎవరికీ న్యాయం అందకుండా పోకూడదని న్యాయమూర్తులు పేర్కొన్నారు.
News November 9, 2025
త్వరలోనే ఏనుగుల సమస్యలకు పరిష్కారం: పవన్

ఏనుగుల గుంపుతో కన్నా ఒంటరి ఏనుగుతోనే ఎక్కువ ప్రమాదమని MLA అమర్‌నాథ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన Dy.CM పవన్‌తో కలిసి పలమనేరులోని కుంకీ ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. అధికారులు ‘ఏనుగులతో సమస్యలు వాటి పరిష్కార మార్గాలను’ వివరించారు. కుంకీ ఏనుగులతో ఒంటరి ఏనుగులకు చెక్ పెట్టవచ్చని, దీనికి సాంకేతిక తోడైతే మరింత ప్రయోజనం ఉంటుందని వారు పేర్కొన్నారు. కలెక్టర్, DFO పాల్గొన్నారు.


