News March 28, 2025
HYD: అమ్మాయిలూ.. ఆటో ఎక్కుతున్నారా?

HYDలో అనేక మంది ఆటోలను బుక్ చేసుకోవడం, ప్యాసింజర్ ఆటోలో ప్రయాణించడం చేస్తుంటారు. వారి భద్రత కోసం పోలీసులు ‘మై ఆటో ఈజ్ సేఫ్’ పేరుతో ఆటో డ్రైవరు వివరాలతో పాటు QR కోడ్ ఉండేలా ఏర్పాటు చేశారు. ఆటోలో ఏదైనా మర్చిపోయినా, ఆటో డ్రైవర్ అసభ్యకరంగా ప్రవర్తించినా, ఆటోలోని క్యూఆర్ కోడ్ పోలీసులకు పంపిస్తే చాలు, వెంటనే చర్యలు చేపట్టి సహాయం చేస్తామని పోలీసులు తెలిపారు.
Similar News
News March 31, 2025
మంచిర్యాల జిల్లా అధికారిపై చీటింగ్ కేసు

జిల్లా ఉపాధి కల్పనాధికారి రవి కృష్ణపై చీటింగ్ కేసు నమోదయింది. 4/2024లో మందమర్రికి చెందిన RTI కార్యకర్త రాజేందర్ గౌడ్ ఔట్ సోర్సింగ్ వివరాలు కావాలని RTIచట్టం ద్వారా దరఖాస్తు చేశారు. 5/2024లో రూ.25,085 చెల్లిస్తే సమాచారం ఇస్తానని సదరు చెప్పడంతో DDద్వారా నగదు చెల్లించారు. కాగా అధికారుల నుంచి సమాదానం రాకపోడంతో కోర్టును ఆశ్రయించాడు. దీంతో అధికారిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు కోర్టు సూచించింది.
News March 31, 2025
రేపటి నుంచి కొత్త రూల్స్

స్టాండర్డ్ డిడక్షన్ ₹75Kతో కలుపుకుని ₹12.75L వరకు పన్ను మినహాయింపు.
బ్యాంకుల్లో డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు జమయ్యే వడ్డీ ₹లక్ష వరకు, 60ఏళ్లలోపు వ్యక్తులకు ₹50K వరకు నో TDS.
ఇన్‌యాక్టివ్/వేరే వారికి కేటాయించిన మొబైల్ నంబర్లకు UPI సేవలు రద్దు.
UPI లైట్ వ్యాలెట్‌లో డిపాజిట్ చేసిన నగదును బ్యాంక్ అకౌంట్‌కు పంపుకోవచ్చు.
NPS వాత్సల్యలో పెట్టుబడులకు సెక్షన్ 80CCD(1B)కింద పన్ను మినహాయింపు.
News March 31, 2025
ఒంటిమెట్ట రాములోరికి నంద్యాల తళంబ్రాలు సిద్ధం

ఒంటిమిట్ట శ్రీ రాములవారి కళ్యాణం కోసం భక్తులు వడ్లను గోటితో ఒలిచిన తళంబ్రాలను నంద్యాల సంజీవనగర్ రామాలయంలో శ్రీ కోదండ రామస్వామి సమక్షంలో పూజ చేశారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా వడ్లను భక్తులు రామాలయంలో గోటితోనే ఒలుస్తారని తెలిపారు. ఆ తళంబ్రాలను కళ్యాణం సమయంలో రాముల వారి చెంతకు చేరుస్తారని అర్చకులు తెలిపారు.