News February 23, 2026

HYD: అమ్మాయిలూ జాగ్రత్త.. సజ్జనార్ వార్నింగ్

image

హైదరాబాద్‌లో పెళ్లిచూపులు, నిశ్చితార్థం పేరుతో జరుగుతున్న మోసాలపై యువతులను ట్విటర్ వేదికగా సీపీ సజ్జనార్ హెచ్చరించారు. నిశ్చితార్థం తర్వాత చనువు పెంచుకుని, శారీరకంగా లోబరుచుకుని, ఆపై అదనపు కట్నం కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని CP పేర్కొన్నారు. పరువు పోతుందన్న భయంతో మౌనంగా ఉండవద్దని, ఇలాంటి వేధింపులు ఎదురైతే వెంటనే షీ టీమ్స్(9490616555) లేదా డయల్ 100ను సంప్రదించాలని సూచించారు.

Similar News

News February 24, 2026

విజయ్ సేతుపతి, సాయి పల్లవి క్రేజీ కాంబో!

image

మణిరత్నం దర్శకత్వంలో ఒక ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ రూపుదిద్దుకోనుంది. ఇందులో విజయ్ సేతుపతి హీరోగా, సాయి పల్లవి హీరోయిన్‌గా నటించబోతున్నట్లు సమాచారం. ఈ కథను ముందుగా ధనుష్‌కు వినిపించగా వివిధ కారణాలతో ఆయన తప్పుకున్నారట. తర్వాత శింబు, ధ్రువ్ విక్రమ్ పేర్లు వినిపించాయి. ఫైనల్‌గా విజయ్ సేతుపతి ఫిక్సయ్యారు. AR రెహమాన్ సంగీతం అందించనున్నారు. షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానున్నట్లు టాక్.

News February 24, 2026

‘సాగునీటి’ ఎన్నికల్లోనూ ‘ఇద్దరు పిల్లల’ నిబంధన ఎత్తివేత

image

AP: స్థానిక ఎన్నికల తరహాలోనే సాగునీటి సంఘాల ఎన్నికల్లోనూ ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నా పోటీ చేసేలా ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. దీనికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ‘1980-90లో జనాభా పెరిగిన కారణంగా ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో సంతానోత్పత్తి పడిపోయింది. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని ఇద్దరు పిల్లల నిబంధన తొలగిస్తున్నాం’ అని మంత్రి రామానాయుడు తెలిపారు.

News February 24, 2026

కల్తీ నెయ్యిపై నేడు అసెంబ్లీలో చర్చ

image

AP: తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో చర్చించనుంది. ఉ.10.30 నుంచి మ.2 గంటల వరకు టీడీపీ, బీజేపీ, జనసేనకు చెందిన 10 మంది సభ్యులు ఈ అంశంపై మాట్లాడనున్నారు. గొంతునొప్పి కారణంగా నిన్న సభకు హాజరుకాని డిప్యూటీ సీఎం పవన్ కూడా నేడు సభలో ప్రసంగించే అవకాశం ఉంది. మ.12.30 నుంచి సీఎం చంద్రబాబు మాట్లాడి చివరలో ఓ ప్రకటన విడుదల చేస్తారు.