News October 16, 2025

HYD: అయ్యో.. ఆమె బయటపడుతుందా?

image

HYD మహిళకు 25ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ దుబాయ్‌ కోర్టు తీర్పునిచ్చింది. బహదూర్‌పురకు చెందిన మహిళ బ్యూటీషన్ పనికోసం దుబాయ్‌ వెళ్లడానికి ఓ ఏజెంట్ ద్వారా వీసా ప్రాసెసింగ్ చేసుకుంది. అతడు ఆమెకు ఓ పార్సిల్ ఇచ్చాడని, ఎయిర్‌పోర్ట్‌లో దిగాక అందులో గంజాయి ఉందని కుటుంబీకులు ఆరోపించారు. ఆమెకు 5ఏళ్ల కొడుకు ఉన్నాడు. కుటుంబపోషణకు వెళ్తే.. జైలుశిక్ష పడిందని ఆమెను కాపాడాలని కేంద్రాన్ని కోరగా ప్రభుత్వం స్పందించింది.

Similar News

News October 16, 2025

మంత్రుల వ్యవహారంపై ఇన్‌ఛార్జి నటరాజన్ సీరియస్

image

మంత్రుల వ్యవహారంపై కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌ఛార్జి నటరాజన్ సీరియస్ అయ్యారు. మంత్రుల మధ్య వరుస విభేదాలపై అసహనం వ్యక్తం చేశారు. మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై ఆమె ఆరా తీశారు. సీఎం, మంత్రులపై కొండా సురేఖల కుమార్తె సుష్మిత చేసిన కామెంట్స్‌ ఎందుకు చేశారనే దానిపై ఇన్‌ఛార్జి ఆరా తీశారు.

News October 16, 2025

జూబ్లీ సాక్షిగా సర్కారుపై పోరుకు సిద్ధం

image

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకు 22 నెలల 9 రోజులైంది. ఈ లోపే పలువురు సర్కారుపై అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీచేసి ప్రభుత్వానికి నిరసన తెలుపుతామని బాధితులు బహిరంగంగా ప్రకటించారు. RRR, లగచర్ల భూసేకరణ, ఫార్మాసిటీ బాధితులు, గ్రూప్-1 అభ్యర్థులు, మాలసంఘాల నాయకులు నామినేషన్లు వేసి నిరసన వ్యక్తం చేస్తామంటున్నారు. వీరందరి పోరు ఎవరికి నష్టమో తెలియాలి.

News October 16, 2025

HYD: నామినేషన్ ఇప్పుడు పార్ట్ టైమ్ బిజినెస్

image

ఎన్నికలంటే ఎంతోమంది నామినేషన్లు వేయడం చూస్తుంటాం. వీరిలో కొందరు పేరు కోసం వేస్తే.. మరికొందరు స్వలాభం కోసం వేస్తారు. పేరుకోసం వేసేవారు తాను ఇన్నిసార్లు నామినేషన్ ఫైల్ చేశా అని చెప్పకోవడానికి, ఇంకొందరు ఓట్లు చీల్చడానికి స్వలాభంతో పోటీలో దిగుతారు. దీంతో గెలుపు అవకాశాలు కొందరికి తగ్గిపోతాయి. అందుకే గెలిచే అభ్యర్థి ఇచ్చే డబ్బుతో విత్ డ్రా చేసుకుంటారన్నమాట. ఇప్పుడుదే ట్రెండ్ర్ జూబ్లీలో కొనసాగుతోందా?