News June 15, 2024
HYD: అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన

ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఎస్ఎల్వీ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ గురువర్యులు చింత నాగార్జున శిష్య బృందం కర్ణాటక గాత్ర కచేరి, కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. కర్ణాటక గాత్ర కచేరీలో చూడమ్మా సతులారా, భో శంభో, వేంకటేశుడు, తరతరాల తిరుమల, స్వాగతం కృష్ణ, గోదావరి అంశాలను కళాకారులు ఆలపించారు. నాగజ్యోతి శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు.
Similar News
News July 9, 2025
కూకట్పల్లి: కల్తీ కల్లు ఘటనలో నలుగురి మృతి

కూకట్‌పల్లిలో కల్తీ కల్లు తాగిన ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఇప్పటివరకు తులసీ రామ్, చాకలి బొజయ్య, నారాయనమ్మ, స్వరూప (56)తో కలిపి నలుగురు మృతి చెందారు. కల్తీ కల్లు తాగడంతో నిన్న సాయంత్రం నుంచి అస్వస్థతకు గురై 19 మంది ఆస్పత్రిలో చేరారు. బాధితులందరినీ నిమ్స్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ కాసేపటి క్రితం ఆమె మృతి చెందింది. మృతుల సంఖ్య పెరగుతుండటంతో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
News July 8, 2025
నాంపల్లిలో ఏసీబీకి చిక్కిన కమర్షియల్ ట్యాక్స్ అధికారి

GST రిజిస్ట్రేషన్ కోసం రూ.8 వేలు లంచం డిమాండ్ చేసిన మాదాపూర్ సర్కిల్ డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ సుధారెడ్డి ACB అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నాంపల్లి గగన్ విహార్‌లోని కార్యాలయంలో ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా అధికారులు దాడుల చేశారు. కంపెనీ అభ్యర్థనపై రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం లంచం కోరినట్లు గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News July 5, 2025
HYD: ‘వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’

వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వీ కర్ణన్ అన్నారు. శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన వర్క్ షాప్‌లో ఆయన మాట్లాడారు. అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.