News February 11, 2025

HYD: అలవాట్ల మార్పుతో క్యాన్సర్: MNJ డాక్టర్

image

అలవాట్ల మార్పుతో క్యాన్సర్ల ప్రభావం రోజు రోజుకు పెరుగుతోంది. తంబాకు, గుట్కా, పాన్ మసాలా, జంక్ ఫుడ్ పలు సమస్యలు కారణంగా మారుతోంది. వ్యాధిని తొలి దశలో గుర్తిస్తే 90% నియంత్రించవచ్చని, ముఖ్యంగా జంక్ ఫుడ్స్, పర్యావరణ కాలుష్యం, రసాయన మందులతో పండించిన ఆహార పదార్థాల ద్వారా ముప్పు పెరుగుతున్నట్లు HYD MNJ క్యాన్సర్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.

Similar News

News December 31, 2025

NTR: మట్టి తవ్వకాలు.. సంపద దోపిడీ షురూ.!

image

మైలవరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. కొత్తూరు, తాడేపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా 35ఎకరాల అసైన్డ్ భూముల్లో తవ్వకాలు జరుపుతూ ప్రకృతి సంపదను దోచేస్తున్నారు. గతంలో మైనింగ్ అధికారులు రూ.150కోట్ల రికవరీ నోటీసులు ఇచ్చి, ఆంక్షలు విధించినా అధికార పార్టీ నేతల అండతో దందా నిరాటంకంగా సాగుతోంది. CM చంద్రబాబు ‘సంపద సృష్టి’ అంటుంటే, క్షేత్రస్థాయిలో నేతలు ‘సంపద దోపిడీ’ చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి.

News December 31, 2025

పల్నాడు: ముగిసిన పిన్నెల్లి సోదరుల పోలీస్ విచారణ

image

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి పోలీస్ విచారణ ముగిసింది. గుండ్లపాడు జంట హత్య కేసులకు సంబంధించి నెల్లూరు సెంటర్ జైల్లో రిమాండ్‌లో ఉన్న వారిని మాచర్ల రూరల్ పోలీసులు విచారించారు. దర్యాప్తులో భాగంగా సంఘటనపై వివరాలు తీసుకునేందుకు కోర్టు అనుమతితో పోలీసులు పిన్నెల్లి సోదరులను ప్రశ్నలు అడిగి, వారి నుంచి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.

News December 31, 2025

గద్వాల: వేడుకల వేళ అప్రమత్తం.. 108 సిబ్బందికి ఆదేశాలు

image

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో 108 అంబులెన్స్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా కోఆర్డినేటర్ రత్నమయ్య ఆదేశించారు. డిసెంబర్ 31 రాత్రి యువత ఉత్సాహంతో వాహనాలను వేగంగా నడిపే క్రమంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేలా సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు. యువత మితిమీరిన వేగంతో ప్రయాణించకుండా, ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని ఆయన కోరారు.