News February 12, 2025

HYD: అలా చేస్తే క్యాన్సర్ వ్యాధికి చెక్ పడినట్లే..!

image

జీవనశైలి మార్చుకుంటే 30% క్యాన్సర్లకు దూరంగా ఉండొచ్చని HYD పంజాగుట్ట NIMS ఆసుపత్రి డాక్టర్ సదాశివుడు తెలిపారు. రోజూ వ్యాయామం, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, నట్స్ ఆహారంలో భాగంగా చేసుకోవాలని, మహిళలు ఏడాదికి ఒకసారి మమ్మోగ్రఫీ, పాప్‌స్మియర్ టెస్టులు చేయించుకోవాలని డాక్టర్ సూచించారు. ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదన్నారు.

Similar News

News February 12, 2025

ధర్మవరంలో కేజీ చికెన్ రూ.160

image

రాష్ర్టంలో బర్డ్‌ఫ్లూతో పెద్ద ఎత్తున కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. కోళ్లకు వైరస్‌ సోకుతుండటంతో జనాలు చికెన్‌ తినేందుకు భయపడుతున్నారు. ఈ క్రమంలో చికెన్‌ ధరలు కూడా భారీగా తగ్గిపోయాయి. అయితే ధర్మవరంలో బర్డ్ ఫ్లూ సమస్య లేదని, ఇక్కడికి కర్ణాటక నుంచి కోళ్లు వస్తున్నట్లు స్థానిక వ్యాపారులు తెలిపారు. కేజీ చికెన్ రూ.160, స్కిన్ లెస్ కేజీ రూ.180తో విక్రయిస్తున్నట్లు చెప్పారు.

News February 12, 2025

పరారీలో MLA: వేట మొదలుపెట్టిన పోలీసులు

image

ఢిల్లీలోని ఓక్లా MLA అమనతుల్లా ఖాన్ (ఆప్) కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆయన నిన్నటి నుంచి పరారీలో ఉన్నారు. దీంతో టీములుగా విడిపోయిన అధికారులు ఢిల్లీ, రాజస్థాన్, యూపీలో సెర్చ్ ఆపరేషన్ వేగవంతం చేశారు. త్వరలోనే ఆయన్ను పట్టుకుంటామని అంటున్నారు. ఓ మర్డర్ కేసులో నిందితుడైన షాబాజ్ ఖాన్‌ తప్పించుకొనేందుకు మద్దతుదారులతో కలిసి ఆయన సాయం చేశారని నిన్న FIR నమోదైంది. అప్పటి నుంచి ఆయన కనిపించడం లేదు.

News February 12, 2025

కొల్లిపరలో భారీ కొండ చిలువ 

image

కొల్లిపర మండలం పిడపర్తిపాలెంలో బుధవారం భారీ కొండచిలువ కలకలం రేపింది. గ్రామానికి చెందిన రైతు ఆదాము ఉదయం పనుల నిమిత్తం పొలానికి వెళ్లాడు. ఈ సమయంలో నిమ్మతోటలో భారీ కొండ చిలువ కనిపించడంతో భయాందోళనకు గురయ్యాడు. ఊర్లోకి వెళ్లి గ్రామస్థులను తీసుకువచ్చి కొండ చిలువను పట్టుకొని కృష్ణానది పరీవాహక ప్రాంతంలో వదిలారు. తరచూ గ్రామంలో, పొలాల్లో కొండ చిలువలు కనిపిస్తుండటంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. 

error: Content is protected !!