News December 28, 2024
HYD: అవగాహనతోనే మదకద్రవ్యాల నిర్మూలన: సందీప్ శాండిల్య
అవగాహనతో మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందని టీజీఏఎన్‌బీ డైరెక్టర్ సందీప్ శాండిల్య అన్నారు. శనివారం ‘డ్రగ్-ఫ్రీ వెల్‌నెస్’ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎడిస్టీస్ ఫౌండేషన్, క్రియేట్ ఎడ్యుటెక్‌లతో సహకార ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మార్గదర్శకాలతో ఆన్‌లైన్ ప్రోగ్రామ్ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు.
Similar News
News December 29, 2024
మీరు బుక్ ఫెయిర్‌కు వెళ్లలేదా.. నేడే ఆఖరు!
చినిగిన చొక్కా తొడుక్కో.. ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్నారు కందుకూరి వీరేశలింగం. ఒక మంచి పుస్తకం కొనకుంటే, నీ జీవితమంతా అజ్ఞానమే అన్నారు మరికొందరు మేధావులు. అందుకేనేమో హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన బుక్ ఫెయిర్ – 2024 నిరంతరం పుస్తక ప్రియులతో నిండుగా కనిపిస్తోంది. ఈ నెల 19న ప్రారంభమైన బుక్ ఫెయిర్ నేటితో ముగియనుంది. మరి మీరు బుక్ ఫెయిర్‌కు వెళ్లారా..? అక్కడ ఏ పుస్తకం కొన్నారో కామెంట్ ప్లీజ్..!
News December 29, 2024
జూబ్లీహిల్స్‌లో 4 పబ్‌లకు అనుమతి లేదు!
న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ నగరం ముస్తాబవుతోంది. జూబ్లీహిల్స్‌లో మొత్తం 36 పబ్ లు ఉండగా.. ఇందులో నాలుగింటికి పోలీసులు అనుమతులు నిరాకరించారు. హార్డ్ కప్, అమ్నేషియా, బ్రాడ్ వే, బేబీలాన్ పబ్‌లకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. గతంలో ఆయా పబ్‌లలో జరిగిన గొడవలు, పోలీసు కేసుల కారణంగా వాటిపై ఆంక్షలు విధిస్తూ అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు స్పష్టం చేశారు. అర్ధరాత్రి ఒంటి గంటలోగా వేడుకలు ముగించాలని పేర్కొన్నారు.
News December 29, 2024
హైదరాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు!
గడచిన 24 గంటల్లో హైదరాబాద్ నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. మోండామార్కెట్ 18.2℃, వెస్ట్ మారేడ్పల్లి, షేక్‌పేట, రియాసత్‌నగర్ 18.4, కంచన్‌బాగ్, చంద్రయాన్ గుట్ట 18.7, జూబ్లీహిల్స్, గోల్కొండ 18.8, ఓయూ 18.9, షేక్‌పేట, అడిక్‌మెట్, మెట్టుగూడ, బంజారాహిల్స్ 18.9, బౌద్ధ నగర్, తిరుమలగిరి, బండ్లగూడ 19, లంగర్‌హౌస్, కందికల్ గేట్, బోరబండ 19.2, ముషీరాబాద్, హిమాయత్‌నగర్, చిలకలగూడలో 19.3℃గా నమోదైంది.