News February 10, 2025
HYD: అవి FAKE జాగ్రత్త..!: T-Hub

నగరంలోని T-hub పేరిట నకిలీ వెబ్ సైట్, నకిలీ మొబైల్ యాప్ పట్ల అప్రమత్తంగా ఉండాలని T-hub సూచించింది. https://thubeco, logical.com/login లాంటి ఫేక్ వెబ్ సైట్, యాప్ పట్ల కొందరు మోసగాళ్లు బురిడీ కొట్టించే కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొంది. పెట్టుబడులు, చెల్లింపుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
Similar News
News March 26, 2026
గద్వాల జిల్లాలో నేటి ముఖ్యంశాలు..!

*గద్వాల: రాములోరి కళ్యాణానికి ఆలయాలు ముస్తాబు
*ఇటిక్యాల: కలెక్టర్ పర్యటన- కార్యాలయాలు తనిఖీ
*ఎస్సీ యాక్షన్ ప్లాన్ కు ఏప్రిల్ 2 వరకు గడువు
*అలంపూర్: జోగులాంబ ఆలయానికి మంచినీటి కూలర్
*రాజోలి: పేదింటి అమ్మాయి పెళ్ళికి రూ.2 లక్షలు సహాయం
*ఇటిక్యాల: పాలకులు మారినా ప్రజా సమస్యలు తీరలేదు
*అయిజ: మిషన్ భగీరథ కనెక్షన్‌కు మోటార్లు అమర్చితే చర్యలు
*ధరూర్: కూలీ డబ్బులు విడుదల చేయాలని ఆందోళన
News March 26, 2026
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల పని వేళల పొడిగింపు

తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియనున్న నేపథ్యంలో రద్దీని దృష్టిలో ఉంచుకొని పని వేళలను పొడిగించింది. ఈ నెల 28, 30, 31 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు 9:30am నుంచి 8:30pm వరకు పని చేస్తాయని చెప్పింది. రిజిస్ట్రేషన్ స్లాట్ల సంఖ్యనూ పెంచింది. సెలవులు తీసుకోకుండా పనిచేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది.
News March 26, 2026
జనగామ జిల్లాలో ఫేమస్ రామాలయాలు ఇవే!

వల్మిడీ, జీడికల్, నవాబ్ పేట, చిలుపూర్, అశ్వారావుపల్లి, జనగామ(శ్రీరామ్ నగర్), నిడిగొండ, బొమ్మెర, నష్కల్, తాటికొండ, విసునూరు, జనగామ(గీతాశ్రమం), తాటికొండ, జఫర్ ఘడ్, రఘునాథపల్లి, ఇప్పగూడెం, స్టేషన్ ఘన్పూర్, ఫతేషాపూర్ గ్రామాల్లో రామాలయాలు ఉన్నాయి. రేపు సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరగనున్నాయి.
మీ ఊరిలో రామాలయం ఉందా? SHARE


