News July 19, 2024

HYD: అసభ్య ప్రవర్తన.. కొట్టి చంపేసిన మహిళలు

image

అసభ్యంగా ప్రవర్తించాడని‌ ఓ యువకుడిపై మహిళలు దాడి చేశారు. దెబ్బలు తాళలేక కుప్పకూలిన అతడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. శంషాబాద్‌ మున్సిపాలిటీ పరిధి ప్రకాశ్‌నగర్‌లో కుమార్(35)ను <<13660377>>చెట్టుకు కట్టేసి కొట్టారు<<>>. మిస్‌బిహేవ్ చేశాడని‌ విచక్షణ రహితంగా దాడి చేయడంతో‌ చనిపోయాడు. ఈ కేసులో పోలీసులు నలుగురు మహిళలను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. RGIA పోలీసులు విచారణ చేపట్టారు.

Similar News

News September 4, 2024

మత్స్యకారులు హెల్ప్‌లైన్ నంబర్‌ సేవ్ చేసుకోండి

image

తెలంగాణ మత్స్యకారుల కోసం 24 గంటల హెల్ప్‌లైన్ సేవలను ఆ శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని మత్స్య భవన్‌లో మత్స్య శాఖ కమిషనర్ డా.ప్రియాంక అలా, తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ ఈ హెల్ప్ లైన్ నెంబర్‌ను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు సహాయార్థం 8090199299 హెల్ప్ లైన్ నంబర్‌ను అందుబాటులో ఉంచారు.

News September 3, 2024

WOW: అయోధ్య మందిరంలో బాలాపూర్‌ గణేశుడు!

image

వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా బాలాపూర్‌ గణేశుడు ఈసారి మరింత ప్రత్యేకంగా దర్శనమివ్వనున్నాడు. ప్రతి ఏటా ప్రముఖ పుణ్యక్షేత్రాల థీమ్‌తో డెకరేషన్ చేస్తారు. 2023లో బెజవాడ దుర్గమ్మ గుడి సెట్టింగ్ వేశారు. ఈ ఏడాది అయోధ్య బాల రాముడి ఆలయ ఆకారంలో మండపం నిర్మిస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన సీనియర్ డెకరేటర్ సుధాకర్ రెడ్డి ఈ సెట్టింగ్ వేస్తున్నారు. భక్తులకు మరింత కనువిందుగా మండప నిర్మాణం ఉంటుందన్నారు.

News September 3, 2024

RRR భూముల విలువ భారీగా పెరిగాయి

image

రీజినల్ రింగ్ రోడ్డు (RRR) దక్షిణ భాగంలో భూసేకరణ చేయాల్సిన గ్రామాల్లోని భూముల రిజిస్ట్రేషన్ విలువలను సర్కారు భారీగా పెంచింది. ఏకంగా 2 నుంచి 5 రెట్ల వరకు పెంచేసింది. భూములు కోల్పోతున్న రైతులకు అధిక పరిహారం దక్కేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గత నెల 28న స్పీడ్-19 ప్రాజెక్టుల సమీక్షలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి RRR దక్షిణ భాగంపై చర్చించి, ఆదేశాలు జారీ చేశారు.