News April 15, 2024

HYD: అసలే ఎండాకాలం.. దొంగలతో జాగ్రత్త!

image

ఎండాకాలం వచ్చేసింది. HYD నగరంలో ఇంటిల్లిపాది విహారయాత్రలు, సొంతూళ్లకు వెళ్తుంటారు. ఏటా HYD, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లలో కలిపి 3 వేలకు పైగా చోరీలు జరుగుతుంటే అందులో అధిక శాతం ఈ వేసవి మూడు నెలల వ్యవధిలోనివేనని అధికారులు తెలిపారు. అంతర రాష్ట్ర ముఠా సైతం వేసవిని ఆసరాగా చేసుకుంటున్నారు. అందుకే వేసవి వేళ, నగర ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

Similar News

News January 8, 2025

HYD: లవర్స్ సజీవదహనం (UPDATE)

image

ఘట్‌కేసర్ PS పరిధి ORR సర్వీస్‌ రోడ్డుపై కారు దగ్ధం ఘటనలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. చనిపోయే ముందు శ్రీరామ్(25) ఫోన్ నుంచి అమ్మాయి(17) వాట్సాప్‌లో లైవ్ లొకేషన్‌తో పాటు 3 పేజీల లెటర్‌ను ఆమె తండ్రికి సెండ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అంతకుముందే అన్నోజిగూడలోని ఓ దుకాణంలో పెట్రోల్ కొనుగోలు చేసినట్లు తెలిసింది. బాలిక తండ్రి వారున్న లొకేషన్‌ వెళ్లేసరికి కూతురు, శ్రీరామ్ మంటల్లో <<15087962>>సజీవదహనమయ్యారు<<>>.

News January 8, 2025

HYDలో ఒకేసారి పూసిన 92 పువ్వులు

image

అరుదుగా కనిపించే బ్రహ్మ కమలాలు ఒకేసారి 92 వికసించాయి. మణికొండ మున్సిపాలిటీ పుప్పాలగూడలోని ధనలక్ష్మి రమణమూర్తి ఇంట్లో చెట్టుకు ఈ అద్భుతం జరిగింది. ఒకే రోజు పదుల సంఖ్యలో పూలు పూయడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఏడాదికి ఒకేసారి పూసే బ్రహ్మకమలాలు విరివిగా పూయడం విశేషం.

News January 8, 2025

చర్లపల్లి టెర్మినల్ ఓపెన్.. మరి రోడ్లు?

image

చర్లపల్లి టెర్మినల్ అత్యాధునిక హంగులతో‌ ప్రారంభమైంది. స్టేషన్‌కు వెళ్లే రోడ్లను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికుల అభిప్రాయం. సిటీ నుంచి వచ్చే వారు హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్ మీదుగా స్టేషన్‌కు చేరుకోవచ్చు. కీసర, మేడ్చల్, ECIL వాసులు రాంపల్లి మీదుగా వస్తారు. ప్రస్తుతం ఈ రహదారులు బాగానే ఉన్నాయి. ప్రయాణికుల రద్దీ పెరిగితే రోడ్లను విస్తరించాల్సిందేనా..? దీనిపై మీ కామెంట్?