News August 25, 2025

HYD: ఆగస్టు 31న అనంతగిరి హిల్స్ బర్డ్ వాక్..!

image

అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలోని మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో బర్డ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి 14 మంది పక్షుల ప్రేమికులు పాల్గొన్నారు. పక్షుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రంజిత్ నాయక్ తెలిపారు. తదుపరి బర్డ్ వాక్ ఆగస్టు 31న అనంతగిరి హిల్స్‌లో జరగనుంది.

Similar News

News August 25, 2025

చొప్పదండి: వృద్ధురాలిని రక్షించిన ఫైర్ సిబ్బంది

image

చొప్పదండి పట్టణంలో ప్రమాదవశాత్తు బావిలో పడ్డ ఓ వృద్ధురాలిని ఫైర్ అధికారులు కాపాడిన ఘటన సోమవారం జరిగింది. స్థానిక 13వ వార్డుకు చెందిన పంచల భాగ్యలక్ష్మి అనే వృద్ధురాలు అనుకోకుండా బావిలో పడింది. విషయం తెలిసిన వెంటనే చొప్పదండి ఫైర్ స్టేషన్ ఆఫీసర్ పవన్ ఆధ్వర్యంలో ఫైర్ సిబ్బంది రెస్కు ఆపరేషన్లో భాగంగా తాళ్ల సాయంతో వృద్ధురాలిని
క్షేమంగా బయటికు తీశారు. ఈ సందర్భంగా పలువురు ఫైర్ సిబ్బందిని అభినందించారు.

News August 25, 2025

ఆశాలకు రూ.18 వేల వేతనం ఇవ్వాలి: హరీశ్ రావు

image

ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల వేతనం ఇవ్వాలని ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. సోమవారం డిమాండ్ల సాధనకై ఇందిరాపార్క్ వద్ద ఆశా వర్కర్లు చేపట్టిన మహా ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆశా వర్కర్ల శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు, చేతలకు పొంతన ఉండడం లేదని విమర్శించారు. ఆశా వర్కర్ల రాష్ట్ర అధ్యక్షురాలు సంతోష పాల్గొన్నారు.

News August 25, 2025

వరంగల్ మార్కెట్‌లో ఉత్పత్తుల ధరలు ఇలా..!

image

వరంగల్ జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా మక్కలు (బిల్టీ) రూ.2,365, సూక పల్లికాయ రూ.6,200, పచ్చి పల్లికాయ రూ.3,500 పలికాయి. అలాగే 5531 రకం మిర్చికి రూ.13 వేలు, ఇండిక మిర్చి రూ.13,800, డీడీ మిర్చి రూ.14 వేలు, నం.5 రకం మిర్చికి రూ.13,300 ధర లభించిందని వ్యాపారులు తెలిపారు.