News December 29, 2024

HYD: ఆగాల్సిందే.. 15 నిమిషాల ముందే ప్రకటన..!

image

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్దకు చేరుకునే రైళ్లు ఏ ఫ్లాట్ ఫాం వైపు వస్తాయనేది కేవలం 15 నుంచి 20 నిమిషాల ముందు మాత్రమే ప్రకటిస్తున్నారు. అప్పటి దాకా ప్రయాణికులు ఆగాల్సిందే. ఎటు వస్తుందో..? తెలియక ప్రయాణికులు ఎంట్రన్స్ బోర్డు వద్దకు వచ్చి గంటల తరబడి వేచి చూస్తున్నారు. ఒక్కోసారి చివరి క్షణంలో ఫ్లాట్ ఫాం నంబర్ మారుతోంది. పునరాభివృద్ధి పనులు జోరుగా సాగుతున్న వేళ, ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు.

Similar News

News January 1, 2025

HYD: రాష్ట్ర పోలీసుల విశిష్ట సేవలకు పతకాలు

image

HYD: తెలంగాణ పోలీసుల విశిష్ట సేవలకు పతకాలను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. తెలంగాణ పోలీసులకు 617 పతకాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో శౌర్య పతకం1, మహోన్నత సేవా పతకం17, ఉత్తమ సేవా పతకం 93, కఠినసేవా పతకం 46, సేవా పతకం 460 ఇచ్చారు. నూతన సంవత్సరంలో ఈ సేవా పతకాలు రావడం డీజీపీ జితేందర్ హర్షం వ్యక్తం చేశారు. 

News December 31, 2024

HYD: డ్రంక్ అండ్ డ్రైవ్‌కు చిక్కారో.. ఇక అంతే

image

న్యూ ఇయర్ వేడుకల వేళ ఆకతాయులు, మద్యం ప్రియుల ఆటలు అరికట్టేందుకు హైదరాబాద్ పోలీసులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ముందస్తుగా న్యూ ఇయర్ వేడుకల వేళ తీసుకునే చర్యలపై పోలీసులు అప్రమత్తం చేశారు. రాత్రి 8 నుంచి రేపు ఉదయం 7 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయనున్నారు. మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10వేలు జరిమానా, 6నెలల జైలు శిక్ష విధించనున్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనే HYD వాసులారా జాగ్రత్త.

News December 31, 2024

HYDలో NEW YEAR సెలబ్రేషన్స్ బంద్‌కు పిలుపు

image

‘విదేశీ విష సంస్కృతిని విడనాడుదాం. స్వదేశీ సంస్కృతిని కాపాడుదాం. జనవరి ఒకటి వద్దు’ అంటూ BJP నేతలు పిలుపునిస్తున్నారు. అల్లాపూర్‌లోని గాయత్రీనగర్‌లో సోమవారం గాంధీ విగ్రహం నుంచి ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం వాల్‌ పోస్టర్ ఆవిష్కరించారు. జనవరి ఒకటిన తేదీ మారడం తప్పా ఇంకో సంబరం ఏమీ లేదన్నారు. ఉగాది మన కొత్త సంవత్సరం అని గుర్తు చేశారు. దీనిపై మీ కామెంట్?