News April 5, 2025

HYD: ఆదాయపు పన్ను శాఖ ఇన్‌స్పెక్ట‌ర్ ఆత్మహత్య

image

HYDలో విషాదం నెల‌కొంది. క‌వాడిగూడ‌లోని సీసీజీవో ట‌వ‌ర్స్‌లోని 8వ అంత‌స్తు నుంచి కింద‌కు దూకి ఓ అధికారిణి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఆదాయ‌పు ప‌న్ను శాఖ ఇన్‌స్పెక్ట‌ర్ జ‌య‌ల‌క్ష్మిగా ఆమెను పోలీసులు గుర్తించారు. ఆమె ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Similar News

News April 6, 2025

HYD: చికెన్ దుకాణాలు ఖాళీ

image

మాంసం ప్రియులకు సండే పండగే. ఉదయం చికెన్, మటన్ షాపుల వద్ద క్యూలైన్లు, కిటకిటలాడే గిరాకీ షరామామూలే. కానీ, ఈ ఆదివారం శ్రీ రామ నవమి కావడంతో దృశ్యం పూర్తిగా మారిపోయింది. ప్రతాపసింగారం సహా HYDలోని అనేక మాంసం దుకాణాలు వెలవెలబోయాయి. ఎప్పుడూ జనసంద్రంగా మారే మార్కెట్లు నిర్మానుష్యంగా కనిపించాయి. ఇదే సీన్ గత వారం ఉగాది రోజూ కనిపించింది. పండుగల దెబ్బకు అమ్మకాలు పూర్తిగా తగ్గాయని వ్యాపారస్థులు చెబుతున్నారు.

News April 6, 2025

HYD: శోభాయాత్ర.. ఈ రూట్‌లు బంద్!

image

శ్రీ రామనవమి శోభాయాత్ర సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని HYD పోలీసులు తెలిపారు. సౌత్ వెస్ట్‌ జోన్‌లో 9AM నుంచి 4PM వరకు, ఈస్ట్‌ జోన్‌లో 2PM నుంచి 9PM వరకు ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుంది. 20 వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటారు. సీతారాంబాగ్, బోయిగూడ కమాన్, MJ మార్కెట్, పుత్లీబౌలి మీదుగా సుల్తాన్‌బజార్‌‌కు ర్యాలీగా వెళ్తారు. ప్రత్యామ్నాయ రూట్‌లో వెళ్లాలని పోలీసులు సూచించారు.SHARE IT

News April 6, 2025

HYD: హనుమంతుడు లేని రామాలయం!

image

అతి పురాతన ఆలయం మన HYD శివారులో ఒకటుంది. శంషాబాద్‌ మం. పరిధిలో 13వ శతాబ్దంలో వేంగీ చాళుక్యులు ఈ ఆలయాన్ని నిర్మించి, శ్రీ లక్ష్మణ సమేత సీతారామచంద్రస్వామి ఏకశిల రాతి విగ్రహాలు నెలకొల్పారు. సీతమ్మవారు కొలువై ఉన్న కారణంగానే ఈ ఊరికి ‘అమ్మపల్లి’అనే పేరు వచ్చిందని నానుడి. గర్భగుడిలో హనుమంతుడి విగ్రహం లేని అరుదైన రామ మందిరం ఇది. ఇక్కడి నుంచే రాముడు ఒంటిమిట్టకు వెళ్లినట్లు పెద్దలు చెబుతారు.

error: Content is protected !!