News April 21, 2024

HYD: ఆదివారం ఆస్తి పన్ను వసూలు

image

ఎర్లీబర్డ్ పథకం కింద ఆస్తి పన్నుపై 5 శాతం రాయితీ లభిస్తుందని, నెలాఖరుతో పథకం ముగుస్తున్నందున ఆదివారం పన్ను వసూలు కేంద్రాలు తెరిచి ఉంటాయని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. జీహెచ్ఎంసీ కార్యాలయాల్లోని పౌర సేవా కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పని చేస్తాయని ఆయన వెల్లడించారు.

Similar News

News October 1, 2024

రంగారెడ్డి కోర్టులో జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ

image

రంగారెడ్డి జిల్లా కోర్టులో లైంగిక ఆరోపణల కేసులో అరెస్టయిన జానీ మాస్టర్‌ మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు అయ్యింది. జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై నేడు రంగారెడ్డి కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే జానీ మాస్టర్‌ను 4 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారించారు. జానీ మాస్టర్‌ఫై అత్యాచార కేసుతో పాటు ఫోక్సో కేసు నార్సింగ్ పోలీసులు నమోదు చేశారు.

News October 1, 2024

HYD: హైడ్రాను రద్దు చెయ్యాలని హైకోర్టులో పిటిషన్

image

హైడ్రా జీవో నెంబర్ 99ను రద్దు కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. హైడ్రా కోసం తీసుకొచ్చిన జీవోను కొట్టేయాలని 2 వేర్వేరు పిటిషన్లు దాఖాలు అయ్యాయి. పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టు విచారణ చేయనుంది. హైడ్రాకు చట్టబద్ధత లేదని, జీవో నెంబర్ 99ను వెంటనే రద్దు చేయాలను కోరుతూ పిటీషన్ దాఖలు కావడంతో దీని తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

News October 1, 2024

రాజస్థాన్‌లో HYD పోలీస్ ఆపరేషన్ SUCCESS

image

రాజస్థాన్‌లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. రాజస్థాన్ కేంద్రంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్న కేటుగాళ్లకోసం రిక్కీ నిర్వహించారు. పక్కా ప్లాన్‌తో వారి స్థావరాలపై మెరుపుదాడి చేసి 27 మందిని అరెస్ట్ చేశారు.