News October 16, 2025

HYD: ఆన్‌లైన్‌లో అమ్మాయి.. మోసపోయిన అబ్బాయి!

image

ఆన్‌లైన్ డేటింగ్, ఫ్రెండ్‌షిప్ స్కామ్‌లో పడ్డ వ్యక్తి రూ.6,49,840 పోగొట్టుకున్నాడు. మలక్‌పేట్‌కు చెందిన వ్యక్తి (32)కి డేటింగ్ సైట్ ద్వారా ఓ అమ్మాయి పరిచయమైంది. పెళ్లి కుదురుస్తామని మాట్లాడి కొంత డబ్బు తీసుకుంది. అనంతరం ఓ ఫ్రెండ్‌షిప్ గ్రూప్‌లో యాడ్ చేసింది. అందులో ఉన్నవారి సూచనల మేరకు బాధితుడు విడతల వారీగా రూ.6,49,840 చెల్లించాడు. తర్వాత మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

Similar News

News October 17, 2025

పిల్లలు చదవట్లేదా?

image

సాధారణంగా చాలామంది పిల్లలు చదువంటే ఆసక్తి చూపరు. ఆటలమీదే మనసు ఉంటుంది. కొన్నిసార్లు ఇది మానసిక సమస్యకు సంకేతం అంటున్నారు నిపుణులు. బార్డర్‌లైన్‌ ఇంటిలిజెన్స్‌, స్పెసిఫిక్‌ లర్నింగ్‌ డిజెబిలిటి, ADHD వంటి సమస్యలుంటే పాఠాలు అర్థంకాకపోవడం, ఏకాగ్రత లోపించడం వంటి లక్షణాలుంటాయి. వీటిని గుర్తిస్తే చైల్డ్‌ సైకియాట్రిస్ట్‌ దగ్గరికి తీసుకెళ్లండి. చదువంటే భయం తగ్గి ఆసక్తి కలిగే పద్ధతులు నేర్పిస్తారు.

News October 17, 2025

యాదాద్రి: నూతన భవనం పైనుంచి పడి దుర్మరణం

image

కొత్తగా నిర్మిస్తున్న ఇంటి స్లాబ్‌కు నీరు పడుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి ఓ వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన భూదాన్ పోచంపల్లి(M) పెద్దగూడెంలో జరిగింది. గ్రామానికి చెందిన పారిపల్లి కృష్ణారెడ్డి(53) తన ఇంటి నిర్మాణంలో భాగంగా స్లాబ్‌కు నీరు పోస్తుండగా కాలుజారి కింద పడ్డారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందారు. భార్య జయమ్మ ఫిర్యాదు మేరకు ఎస్ఐ భాస్కర్ రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.

News October 17, 2025

సమ్మె విరమించాల్సిందే!

image

AP: సమ్మె విరమించాలని, లేకపోతే చర్యలు తప్పవని PHC వైద్యులను వైద్యారోగ్యశాఖ హెచ్చరించింది. ఇన్ సర్వీస్ పీజీ కోటాను పునరుద్ధరణతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి గత నెల 30 నుంచి ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా ఉన్నతాధికారులు చర్చలు జరిపినా సఫలం కాలేదు. ఎస్మా సైతం ప్రయోగిస్తామని చెప్పినా వాళ్లు వెనక్కి తగ్గలేదు. తాజాగా నోటీస్-3 జారీ చేయగా, PHC వైద్యులు ఏం విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.