News October 14, 2025

HYD: ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్‌లో మోసపోయిన తండ్రి, కూతుళ్లు..!

image

HYD LB నగర్‌కు చెందిన RTC ఉద్యోగి M.రామకృష్ణ(49), కూతురు మిథాలీ(23) ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్‌లో మోసపోయారు. AUG 26న వారి స్నేహితుడు పంపిన LF వర్క్ అనే అప్లికేషన్‌‌లో రామకృష్ణ పెట్టుబడి పెట్టాడు. ప్రారంభంలో కొంత రాబడి చూపించగా మొత్తం రూ.1,35,210 ఇన్వెస్ట్ చేశాడు. కూతురు ఇన్వెస్ట్ చేసిన రూ.86,220 తిరిగి డ్రా చేసుకోలేకపోయారు. మోసపోయామని తెలుసుకుని ఫిర్యాదు చేశారని సీఐ వినోద్ కుమార్ తెలిపారు.

Similar News

News October 14, 2025

హైదరాబాద్ వాతావరణ సమాచారం

image

హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో నేడు ఆకాశం మేఘావృతంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశముందని, ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ వేగంతో వీయవచ్చని చెప్పింది. ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది.

News October 14, 2025

BREAKING: HYD: మీర్‌పేట్ మంత్రాల చెరువులో మహిళ మృతదేహం కలకలం

image

రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంత్రాల చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైందని పోలీసులు ఈరోజు తెలిపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని మృతదేహాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న మిస్సింగ్ కేసులను సైతం పోలీసులు పరిశీలిస్తున్నారు.

News October 14, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. మహిళల ఓట్లే కీలకం..!

image

HYD జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పురుషుల ఓట్లు వివిధ పార్టీలకు డివైడ్ అయ్యే అవకాశం ఉన్నా మహిళల ఓట్లు మాత్రం ఒకే పార్టీకి గంప గుత్తగా పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం 3,98,982ఓటర్లు ఉండగా అందులో 1,91,590మంది మహిళా ఓటర్లే ఉన్నారు. కాగా ఫ్రీబస్సు స్కీమ్‌తో‌ మహిళలు తమకే ఓట్లు వేస్తారని కాంగ్రెస్ నేతలు అంటుండగా గతంలో బతుకమ్మ చీరలిచ్చిన KCRవైపే మహిళలు ఉన్నారని BRSనేతలు చెబుతున్నారు.