News August 24, 2024

HYD: ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేసే CHANCE

image

HYD, RR, MDCL, VKB జిల్లాల్లోని ప్రజలు tspolice.gov.in వెబ్‌సైట్ ద్వారా పోలీసులకు ఫిర్యాదులు, సూచనలను ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా చేయొచ్చని HYD, CYB పోలీస్ అధికారులు తెలిపారు. FIR సైతం డైరెక్ట్ వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. ప్రజా భద్రత విషయంలో పారదర్శకతను పాటిస్తున్నట్లుగా పోలీసు యంత్రాంగం తెలిపింది.

Similar News

News March 9, 2026

HYD: పట్టాల మాటున ప్లాట్ల వ్యాపారం!

image

రైలు పట్టాల కింద ఉన్న భూములే మెట్రో ఫేట్ డిసైడ్ చేస్తున్నాయా? 2వ దశ విస్తరణలో అలైన్‌మెంట్ మార్పుల వెనుక రియల్ ఎస్టేట్ మాఫియా హస్తం స్పష్టంగా కనిపిస్తోంది. JAN 2026లో ప్రభుత్వం ₹2,787 కోట్ల భూసేకరణ నిధులను కేటాయించింది. ఎయిర్‌పోర్ట్, ఫోర్త్ సిటీ మెట్రో రూట్లను పదేపదే మార్చడంతో ప్రైవేట్ వెంచర్ల విలువ ₹వేల కోట్లకు చేరింది. TOD పేరుతో జరుగుతున్న ఈ భూముల కేటాయింపులపై ఇప్పటికే హైకోర్టులో PIL దాఖలయ్యాయి.

News March 9, 2026

బిన్ ఫ్రీ HYD.. చెత్తంతా ఖాళీ ప్లాట్లలోనే

image

నగరాన్ని GHMC, CMC, MMC కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసింది అవార్డుల కోసమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. HYD బిన్ ఫ్రీ అయిందని ఆఫీసర్లు ఢిల్లీకి రిపోర్టులు పంపుతున్నారని టాక్. కానీ, గల్లీల్లోకి వస్తే అసలు రంగు బయట పడుతుందన్నది ప్రజల మాట. టాప్ ర్యాంక్ వస్తే ‘మేమే NO.1’ అని చెప్పుకోవచ్చనేది ప్లాన్‌గా తెలుస్తోంది. దీంతో కేంద్రాన్ని మెప్పించినా, రోజూ ఆ దుర్వాసన పీల్చే జనాల్ని ఎలా నమ్మిస్తారనేది ప్రశ్న.

News March 9, 2026

HYD: నేడు స్కాట్లాండ్‌తో భారత్ ఢీ

image

మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ 2026లో భాగంగా నేడు భారత్, స్కాట్లాండ్ జట్లు తలపడనున్నాయి. గచ్చిబౌలి స్టేడియంలో ఈ కీలక మ్యాచ్ జరగనుంది. పూల్-బీలో ఇప్పటికే ఒక విజయం సాధించిన భారత మహిళల జట్టు రెండో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరోవైపు స్కాట్లాండ్ జట్టు కీలక పాయింట్ల కోసం పోరాడనుంది. ఉత్కంఠభరితంగా సాగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30 గం.కు ప్రారంభం కానుంది.