News December 1, 2025

HYD: ఆన్‌లైన్ బెట్టింగ్‌.. మరో యువకుడు బలి

image

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు బానిసై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. ఉప్పల్‌కు చెందిన సాయి (24) శాంతినగర్‌లో పురుగుల మందు తాగి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడి మృతి స్థానికంగా కలకలం రేపింది.

Similar News

News April 14, 2026

కిడ్నీ వ్యాధిని ముందే పసిగట్టేలా పరీక్షలు: మంత్రి

image

AP: ఉద్ధానం వాసులను పట్టిపీడిస్తున్న కిడ్నీ వ్యాధిని ముందే పసిగట్టి ఉపశమనం కల్పించే చర్యలు చేపట్టామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ‘‘బయోమార్కర్స్’ ద్వారా జన్యు, రక్త, మూత్ర పరీక్షలను ప్రత్యేక బృందాలతో నిర్వహిస్తున్నాం. ఇందుకు ICMR ₹6.2CR ఇచ్చింది. వ్యాధి వచ్చే అవకాశాలను ముందే గుర్తించి నివారణ చర్యలు తీసుకుంటున్నాం. పలాస రీసెర్చ్ కేంద్రం సహా విశాఖ KGHలో ప్రత్యేక ల్యాబ్‌లు నెలకొల్పాం’ అని తెలిపారు.

News April 14, 2026

ADB: లొంగిపోయిన మావోయిస్టులతో DGP చర్చలు

image

DGP శివధర్ రెడ్డి ఉమ్మడి ADB జిల్లాలో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. లొంగిపోయిన నక్సలైట్లకు ఇప్పటికీ పునారావాసం కల్పించకపోవడం, రివార్డులు అందించకపోవడం, ఇంటి, వ్యవసాయ భూముల పంపిణీ వంటి హామీలు అమలు కాకపోవడం వంటి సమస్యలు ఆయన దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. ఉట్నూర్‌లో మాజీ మిలిటెంట్లతో సమావేశమై సమస్యలు విన్న ఆయన, త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

News April 14, 2026

మెదక్: అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్‌ విడుదల

image

మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్‌ను అడిషనల్ కలెక్టర్ మెంచు నగేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్నిప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ వారోత్సవాల లక్ష్యమన్నారు. ఇళ్లు, కార్యాలయాల్లో ప్రతి ఒక్కరూ అగ్ని భద్రతా నియమాలను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి జి.వేణు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.