News February 11, 2025

HYD: ఆఫీస్‌లో పనిచేస్తున్న ఉద్యోగులపై కలెక్టర్‌ నిఘా

image

HYD కలెక్టరేట్‌లో పనిస్తున్న ఉద్యోగులపై కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి ప్రత్యేక నిఘా పెట్టారు. వేళలు పాటించకుండా కార్యాలయాలకు రావడం, పనివేళలు ముగియకముందే ఇంటిబాట పడుతున్న వారిపై కొరడా ఝళిపించేందుకు సిద్ధమయ్యారు. ఎవరు ఎప్పుడొస్తున్నారు? ఎంతసేపు పనిచేస్తున్నారు? అనే వివరాలను సేకరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Similar News

News February 11, 2025

నాంపల్లి: జబల్‌పూర్ ప్రమాద ఘటనపై కిషన్ రెడ్డి దిగ్బ్రాంతి

image

జబల్‌పూర్‌లో జరిగిన రోడ్డుప్రమాద ఘటనలో ఏడుగురు హైదరాబాద్ వ్యక్తులు మృతిచెందిన ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన సమాచారం తెలిసిన వెంటనే.. మధ్యప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో మాట్లాడి.. మృతుల కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలను అందించాలని కోరినట్లు తెలిపారు. గాయపడిన ఇద్దరికి సరైన చికిత్స అందించాలని సూచించామన్నారు.

News February 11, 2025

ఓయూ దూర విద్య ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ దూర విద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్ఆర్సీడీఈ)లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఏటా రెండు దఫాలుగా ప్రవేశాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా రెండో దఫా మార్చి 31వ తేదీ వరకు ప్రవేశాలు నిర్వహిస్తున్నామన్నారు. వివరాలకు 040-27097177, 040-27098350 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

News February 11, 2025

BREAKING: HYD: కూకట్‌పల్లిలో భార్యను చంపిన భర్త

image

HYD కూకట్‌పల్లిలో PS పరిధిలో ఈరోజు దారుణం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానిక రాజీవ్ గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న అబ్దుల్ రహీం అనే వ్యక్తి తన భార్య నసీమా బేగంను బండ రాయితో మోది దారుణంగా చంపేశాడు. భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఇంట్లోనే ఆమెను హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!