News April 12, 2024

HYD: ‘ఆర్ట్ టీచర్ మళ్లీ నిర్వహించండి’

image

HYD: గురుకులాల్లో ఆర్ట్ టీచర్ పోస్టుల భర్తీకి మరోసారి నియామక పరీక్ష నిర్వహించాలని TREI-RBను హైకోర్టు ఆదేశించింది. ఇంగ్లిష్‌తో పాటు తెలుగులో పరీక్ష పేపర్ ఇవ్వాలని స్పష్టం చేసింది. నోటిఫికేషన్‌లో తెలుగు, ఇంగ్లిష్ పరీక్ష ఉంటుందని పేర్కొని, కేవలం ఆంగ్లంలోనే పరీక్షను నిర్వహించడంపై పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు పట్ల HYD, ఉమ్మడి RR జిల్లా విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News April 8, 2026

ఆమనగల్లు: WOW.. వరి నాటుతున్న రాహుల్ గాంధీ, సీఎం

image

ఆమనగల్లు మండలం చింతలపల్లికి చెందిన చిత్రకారుడు రూపం వెంకట్‌రెడ్డి వేసిన చిత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రైతు కుటుంబానికి చెందిన సీఎం రేవంత్ రెడ్డికి రైతుల కష్టాలు తెలుసని, రైతు భరోసా పథకాన్ని రైతులందరికీ ఓకే సారీ అందించి ఆదుకోవాలని కోరుతూ రాహుల్ గాంధీ, సీఎం, రైతులతో కలిసి వరి నాటుతున్నట్లు చిత్రం రూపొందించారు. చిత్రకారుడి చిత్రాన్ని రైతులు స్వాగతిస్తూ హర్షిస్తున్నారు.

News April 5, 2026

రంగారెడ్డి: మహిళలకు గుడ్ న్యూస్.. ఉచిత శిక్షణ!

image

రంగారెడ్డి జిల్లా గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించేందుకు SBI RSETI సువర్ణావకాశం కల్పిస్తోంది. టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో ఏప్రిల్ 13 నుంచి 30 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. 19 నుంచి 50 ఏళ్ల మధ్య గల మహిళలు దీనికి అర్హులు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతితో పాటు కోర్సు పూర్తయ్యాక ఉచితంగా టూల్‌కిట్ అందిస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు 7981951167, 9963562266 నంబర్లలో సంప్రదించాలన్నారు.

News April 4, 2026

రాజేంద్రనగర్‌లో హైకోర్టు భవనానికి శంకుస్థాపన

image

రాజేంద్రనగర్‌లో తెలంగాణ హైకోర్టు జోన్-II భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ పాల్గొన్నారు. రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి ఆయనకి గణస్వాగతం పలికారు. CS కె.రామకృష్ణారావు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ తదితరులు ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చారు.