News September 11, 2025
HYD: ఆశలు, ఆకాంక్షలకు చిహ్నాలుగా జైళ్లు: మంత్రి

జైళ్లు నిరాశకు కేంద్రాలుగా కాకుండా, ఆశలు, ఆకాంక్షలకు చిహ్నాలుగా మారాలని మంత్రి శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. “ఏడో ఆలిండియా ప్రిజన్ డ్యూటీ మీట్ – 2025” సందర్భంగా ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో బుధవారం ఏర్పాటు చేసిన ‘కల్చరల్ నైట్’కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జైళ్లను కేవలం శిక్షా కేంద్రాలుగా కాకుండా, మానవత్వంతో కూడిన సంస్కరణలకు వేదికలుగా తీర్చిదిద్దేలా తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
Similar News
News September 11, 2025
MHBD: కలెక్టర్ పేరిట వచ్చే మెసేజ్‌లకు స్పందించవద్దు: కలెక్టర్

మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పేరుతో వచ్చే మెసేజ్‌లకు ఎవరూ స్పందించ వద్దని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు కొత్త వాట్సాప్ నంబర్ సృష్టించినట్లు తెలిసిందని, ఈ నకిలీ నంబర్‌కు ఎవరూ స్పందించవద్దని సూచించారు. సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించి, కలెక్టర్ పేరుతో వచ్చే రిక్వెస్ట్‌లకు స్పందించవద్దన్నారు.
News September 11, 2025
ఎల్లారెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో పులి అడుగులు?

వెంకటాపూర్ మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామ సమీపంలో పులి అడుగులను గ్రామస్థులు గుర్తించారు. రెండు రోజుల క్రితం రామప్ప వాన గుట్టకు పులి అరుపులు వినిపించాయని స్థానికులు తెలపగా, అటవీ శాఖ అధికారులు వానగుట్ట ప్రాంతంలో పరిశీలన చేపట్టారు. రామప్ప వానగుట్ట నుంచి ఎల్లారెడ్డిపల్లి అటవీ ప్రాంతం మీదుగా పులి మేడారం వైపు వెళ్తుండవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై అటవీశాఖ అధికారులు ప్రకటన చేయాల్సి ఉంది.
News September 11, 2025
రెండేళ్ల తర్వాత ఇన్ఫోసిస్‌లో క్యాంపస్ నియామకాలు!

క్యాంపస్ ప్లేస్‌మెంట్లకు ఇన్ఫోసిస్ సన్నాహాలు చేస్తోంది. డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజినీర్ల నియామకం కోసం కాలేజీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు సీనియర్ ఉద్యోగులకు ఆ సంస్థ మెయిల్స్ పంపినట్లు జాతీయ మీడియా పేర్కొంది. కరోనా సంక్షోభం తర్వాత ఇన్ఫోసిస్, ఇతర కంపెనీలు రిక్రూట్‌మెంట్‌ను తగ్గించేశాయి. దాదాపు రెండేళ్ల తర్వాత ఇన్ఫోసిస్ క్యాంపస్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. కొత్తగా 20,000 మందిని తీసుకునే ఛాన్సుంది.