News July 28, 2024

HYD: ఆషాఢ బోనాలు.. సీపీ కీలక ఆదేశాలు

image

బోనాల పండుగ సందర్భంగా పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను రాచకొండ CP సుధీర్ బాబు ఆదేశించారు. కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సున్నితమైన ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సమర్థవంతమైన సిబ్బందిని బందోబస్తులో ఉంచాలని సూచించారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలని, నేరాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Similar News

News October 1, 2024

HYD: ‘దళితుడిని వీసీగా నియమించాలి’

image

తెలుగు విశ్వవిద్యాలయానికి ఇంతవరకు దళితుడిని వీసీగా నియమించలేదని మంగళవారం దళిత బహుజన సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. HYDలో మాట్లాడుతూ.. బీసీ, ఓసీ, బ్రాహ్మణులు వీసీలుగా పనిచేసిన తెలుగు విశ్వవిద్యాలయానికి ఇప్పుడు తమ బహుజనులను నియమించాలని సీఎంను కోరారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యమ నాయకుడు ఆచార్య బన్న అయిలయ్యను వీసీగా నియమించాలని ఈ సందర్భంగా సూచించారు.

News October 1, 2024

రంగారెడ్డి కోర్టులో జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ

image

రంగారెడ్డి జిల్లా కోర్టులో లైంగిక ఆరోపణల కేసులో అరెస్టయిన జానీ మాస్టర్‌ మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు అయ్యింది. జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై నేడు రంగారెడ్డి కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే జానీ మాస్టర్‌ను 4 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారించారు. జానీ మాస్టర్‌ఫై అత్యాచార కేసుతో పాటు ఫోక్సో కేసు నార్సింగ్ పోలీసులు నమోదు చేశారు.

News October 1, 2024

HYD: హైడ్రాను రద్దు చెయ్యాలని హైకోర్టులో పిటిషన్

image

హైడ్రా జీవో నెంబర్ 99ను రద్దు కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. హైడ్రా కోసం తీసుకొచ్చిన జీవోను కొట్టేయాలని 2 వేర్వేరు పిటిషన్లు దాఖాలు అయ్యాయి. పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టు విచారణ చేయనుంది. హైడ్రాకు చట్టబద్ధత లేదని, జీవో నెంబర్ 99ను వెంటనే రద్దు చేయాలను కోరుతూ పిటీషన్ దాఖలు కావడంతో దీని తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.