News February 12, 2026
HYD: ఆస్తిని లాక్కొని.. తండ్రిని గెంటేసిన కూతుర్లు

ఆస్తి కోసం కన్నతండ్రిని కుమార్తెలే వీధిన పడేసిన అమానవీయ ఘటన మారేడుపల్లి సెకండ్ లక్ష్మీనగర్‌లో కలకలం రేపింది. మిథాని రిటైర్డ్ ఉద్యోగి రాజలింగం తనకున్న 130 గజాల స్థలాన్ని ఇద్దరు కుమార్తెల పేరిట రాసిచ్చారు. రిజిస్ట్రేషన్ పూర్తవగానే వారు ఆయన్ని ఇంటి నుంచి గెంటివేశారు. తిండి పెట్టకుండా బయటకు పంపడంతో బాధితుడు కుమార్తెల ఇంటి ముందే ఆందోళనకు దిగారు. ప్రస్తుతం బస్తీవాసులే ఆయనకు ఆశ్రయమిచ్చి ఆదుకుంటున్నారు.
Similar News
News February 12, 2026
జోగిపేట: ‘కౌంటింగ్ కేంద్రంలోకి ప్రింట్ & మీడియాకు అనుమతి లేదు’

జోగిపేటలోని మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కౌంటింగ్ కేంద్రంలోకి పాస్ ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తప్పనిసరిగా జిల్లా కలెక్టర్ సంతకం ఉన్న అక్రిడిటేషన్ కార్డు కలిగి ఉండాలి. నిబంధనల ప్రకారం అనుమతి పత్రాలు లేని వారిని లోపలికి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.
News February 12, 2026
సంగారెడ్డి: కౌంటింగ్ కేంద్రాల వద్ద 163 BNSS సెక్షన్

సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల కౌంటింగ్ కేంద్రాల వద్ద శుక్రవారం 163 BNSS సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్పీ పారితోష్ పంకజ్ గురువారం తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలోకి అభ్యర్థులు గుర్తింపు కార్డులు ఉన్న పోలింగ్ ఏజెంట్లు మాత్రమే వెళ్లాలని పేర్కొన్నారు. విజయం సాధించిన తర్వాత ఎలాంటి ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
News February 12, 2026
GWL: కౌంటింగ్ సెంటర్‌లోకి మొబైల్స్ నిషేధం..!

గద్వాల జిల్లాలో రేపు జరగనున్న మున్సిపల్ ఎలక్షన్ కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ సెంటర్‌లోకి మొబైల్స్‌ను నిషేధించినట్లు శ్రీనివాసరావు గురువారం పేర్కొన్నారు. అగ్గిపెట్టెలు, లైటర్స్, ఇంకు బాటిల్స్, పేలుడు పదార్థాలు, భద్రతకు ముప్పు కలిగించే వస్తువులు లెక్కింపు కేంద్రంలోకి తీసుకురావడం నిషేధించామన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లే ఏజెంట్లు, అభ్యర్థులు విషయాన్ని గ్రహించి కౌంటింగ్‌కు సహకరించాలన్నారు.


