News March 31, 2025
HYD: ఆస్తి పన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ రికార్డు

ఆస్తి పన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ రికార్డు సాధించింది. గ్రేటర్ పరిధిలో పన్ను వసూళ్లు నేటితో రూ.2 వేల కోట్లు దాటిపోయాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2012.36 కోట్లు వసూలైనట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ చరిత్రలోనే తొలిసారిగా ఆస్తిపన్ను వసూళ్లు రూ.2వేల కోట్లు దాటినట్లు అధికారులు పేర్కొన్నారు.
Similar News
News July 10, 2025
సికింద్రాబాద్: 2,500 మంది పోలీసులతో బందోబస్తు

ఆదివారం ఉజ్జయిని మహాకాళి బోనాల జాతరకు 2,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు నార్త్ జోన్ DCP రష్మీ పెరుమాళ్ వెల్లడించారు. ఆలయ ఆవరణలో ఈ రోజు జాతర కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. భక్తుల సందర్శనకు 6 క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జాతర రోజు మ.1 నుంచి 3 గంటల మధ్య శివసత్తులకు ప్రత్యేక దర్శనం ఉంటుందన్నారు. దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్‌కు ప్రత్యేక క్యూలైన్లు ఉంటాయన్నారు.
News July 10, 2025
BRAOUలో ఏ పరీక్షలు వాయిదా అంటే!

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో BLISC పరీక్షలను వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. ఈనెల 12వ తేదీ నుంచి ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించినప్పటికీ వివిధ కారణాల రీత్యా వాయిదా వేసినట్లు చెప్పారు. ఈ పరీక్షల తేదీలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్, స్టడీ సెంటర్లలో సంప్రదించాలని సూచించారు.
News July 10, 2025
26వ తేదీ లోగా డిగ్రీ కోర్సుల మేకప్ ప్రాక్టికల్ పరీక్షలు

ఓయూ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల మేకప్ ప్రాక్టికల్ పరీక్షలను ఈ నెల 26 లోపు నిర్వహించాలని అధికారులు తెలిపారు. ఈ మేరకు అన్ని కళాశాల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్‌డబ్ల్యూ, బీబీఏ తదితర కోర్సుల ఆరో సెమిస్టర్ ఇన్‌స్టెంట్/ మేకప్ ప్రాక్టికల్, ప్రాజెక్ట్, వైవా పరీక్షలను నిర్వహించి 26వ తేదీల్లోగా మార్కుల మెమోలను వెబ్‌సైట్లో అప్లోడ్ చేస్తామన్నారు.