News June 21, 2024

HYD: ఆ ఘటనతో మోదీకి ఏం సంబంధం?: శివాజీ 

image

నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఏం సంబంధం ఉందని ప్రతి పక్షాలను శివసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ ప్రశ్నించారు. శుక్రవారం HYD హిమాయత్‌నగర్‌లోని పార్టీ స్టేట్ ఆఫీస్‌లో ఆయన మాట్లాడారు. ఎన్టీఏను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మలు దహనం చేయడం సరికాదని సూచించారు. విద్యార్థులకు నష్టం చేసే లీకేజీ వ్యవహారాలను ప్రధాని సహించరని అన్నారు.

Similar News

News October 4, 2024

HYD: నేడు హైకోర్టులో వైద్య శిబిరం

image

నిర్మాణ్ సంస్థ, తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ సంయుక్తంగా ఈరోజు హైకోర్టులో మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరం, రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఉస్మానియా సూపరింటెండెంట్ డా.రాకేశ్ సహాయ్ తెలిపారు. ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ముఖ్యఅతిథిగా పాల్గొంటారని పేర్కొన్నారు.

News October 4, 2024

దసరా పండుగకు 6000 ప్రత్యేక బస్సులు

image

దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్ళే ప్రయాణీకులకు ఇబ్బంది కలుగకుండా TGRTC 6000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిందని కూకట్పల్లి ఆర్టీసీ డిపో డీఎం హరి తెలిపారు. రద్దీకి అనుగుణంగా జగద్గిరిగుట్ట, కూకట్‌పల్లి ప్రాంతాల నుంచి కరీంనగర్, నిజామాబాద్, హనుమకొండ, వరంగల్, MBNR, విజయవాడ, రాజమండ్రి, అమలాపురం, కాకినాడ, కర్నూల్, అనంతపురం ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నట్లు డీఎం స్పష్టం చేశారు.

News October 4, 2024

గోవా వెళ్తున్నారా..? సికింద్రాబాద్ నుంచి 2 ట్రైన్లు

image

సికింద్రాబాద్ నుంచి గోవాకు ట్రైన్స్ పెంచాలని ఉన్న ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఈ క్రమంలో గోవాకు వారానికి రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడవనున్నాయి. ఇవి అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి సికింద్రాబాద్ నుంచి గోవా మధ్య నడుస్తాయి. సికింద్రాబాద్- వాస్కోడగామా రైలు (17039/17040) బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి గురు, శనివారాల్లో వాస్కోడగామా నుంచి నడుస్తుంది.