News February 14, 2025
HYD: ఆ పాలు తాగితే వారికి అనారోగ్యమే..!

చిక్కదనం కోసం మాల్టో డెక్స్‌ట్రిన్ కలిపిన పాలు తాగితే షుగర్ పేషెంట్లకు చక్కర స్థాయిలు పెరిగి, అనారోగ్యానికి తీస్తుందని ఫుడ్ సేఫ్టీ కమిషన్ అధికారులు తెలిపారు. అందుకే HYD నగరం సహా అన్ని ప్రాంతాల్లో పాలలో మాల్టో డెక్స్‌ట్రిన్ కలపటాన్ని నిషేధించినట్లుగా పేర్కొన్నారు. ఇందులో హై గ్లైసిమిక్ ఇండెక్స్ (GI) ఉంటుందని X వేదికగా ట్విట్ చేశారు. పాలపై అనుమానం వస్తే ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News July 6, 2025
పాలమూరు: ఈ ఏడాది.. కొత్త స్కూళ్లు మంజూరు.!

ప్రభుత్వ స్కూళ్లపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 8 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మంజూరయ్యాయి. అన్ని వసతులు కల్పిస్తూ ప్రారంభించేందుకు DEOలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే MBNR-9,917, NGKL-9,010, GDWL-7,205, NRPT-8,454, WNPT-8,103 మంది విద్యార్థులు కొత్త అడ్మిషన్లు అయ్యారు. తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్లో కంటే ప్రభుత్వ బడిలో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
News July 6, 2025
సామర్లకోట: యువకుడి హత్య.. నిందితుల అరెస్ట్

సామర్లకోట మండలంలో ఇటీవల చోటుచేసుకున్న యువకుడి హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానానికి అప్పగించినట్లు సీఐ కృష్ణ భగవాన్ శనివారం తెలిపారు. తొలుత మిస్సింగ్ కేసుగా నమోదు చేశామని, దర్యాప్తులో హత్యగా తేలిందని ఆయన వెల్లడించారు. నిందితులపై సెక్షన్ 103(1), 238(a) r/w 3(5) బీఎంఎస్ కింద కేసులు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతుందని సీఐ పేర్కొన్నారు.
News July 6, 2025
శంషాబాద్: రేపు పోస్ట్ ఆఫీస్ సేవలు నిలిపివేత

పోస్ట్ ఆఫీస్ సేవలను సోమవారం నిలిపివేస్తున్నట్లు సౌత్ ఈస్ట్ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ హైమావతి తెలిపారు. వినియోగదారులకు మరింత వేగవంతమైన, సమర్థవంతమైన సేవలు అందించేందుకు తపాలా శాఖ పోస్టల్ టెక్నాలజీ ఐటీ 2.0ను ప్రవేశ పెడుతుంది. ఈనెల 8 నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని, ఇందులో భాగంగా రేపు పోస్టాఫీసుల్లో ఎలాంటి లావాదేవీలు జరగవని పేర్కొన్నారు.