News June 11, 2024
HYD: ఆ ప్రచారం నమ్మకండి: బల్మూరి వెంకట్
పదేళ్లు KCR గడీల పాలన సాగిందని, రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాతే గడీల పాలనకు స్వస్తి పలికామని MLC బల్మూరి వెంకట్ అన్నారు. ఈరోజు HYDలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రజా పాలన వచ్చిందన్నారు. పింక్ మీడియా అసత్యపు ప్రచారం చేస్తోందని, కొత్త యూట్యూబ్ ఛానల్స్ పెట్టి నెలకు రూ.3 లక్షలు ఇస్తున్నారన్నారు. TSకు బదులు TGగా మార్చినందుకు రూ.4 వేల కోట్లు ఖర్చు అవుతాయనేది అబద్ధమన్నారు.
Similar News
News November 29, 2024
బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన GHMC
బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు GHMC సిద్ధమైంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ని రూ.8,600 కోట్లతో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదట బడ్జెట్ ప్రతిపాదనపై మేయర్ అధ్యక్షతన జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశంలో సభ్యులు చర్చించి, ఆ తర్వాత సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి అందజేయనున్నారు. కాగా, 2024-25 బడ్జెట్ రూ.7,937 కోట్లు. దీనిపై మీ కామెంట్?
News November 29, 2024
REWIND: KCR అరెస్ట్.. NIMSలోనే దీక్ష విరమణ
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం KCR చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసింది. 29 NOV 2009లో కరీంనగర్‌లోని తెలంగాణభవన్ నుంచి సిద్దిపేటలోని దీక్ష శిబిరానికి వెళుతుండగా అలుగునూర్ చౌరస్తా వద్ద KCRని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఖమ్మం తరలించారు. జైలులో దీక్ష చేయగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. వెంటనే NIMSకు తరలించారు. DEC 9న కేంద్రం నుంచి సానుకూల ప్రకటన రావడంతో KCR NIMSలో దీక్ష విరమించారు.
News November 29, 2024
HYD: సైకో.. యువతిని చంపేసి అత్యాచారం!
సైకో కిల్లర్ రాహుల్ కేసులో భయంకర నిజాలు వెలుగుచూశాయి. ఈ నెల 14న ఓ యువతిని హత్యాచారం చేసిన కేసులో వల్సాద్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. హత్య చేసి అదే మృతదేహాం పక్కన నిద్రించే అలావాటు రాహుల్‌కు ఉందని గుర్తించారు. సదరు యువతి(19)ని తోటలో చంపిన తర్వాత రెండోసారి అత్యాచారం చేశాడన్నారు. అయితే, <<14729624>>సికింద్రాబాద్-మణుగూరు<<>> రైలులో రమణమ్మను చంపిన ఈ నరహంతకుడిని HYD తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.