News February 19, 2025
HYD: ఆ ఫ్లాట్లు కొని ఇబ్బంది పడొద్దు!

అనుమతి లేని లే అవుట్లలో ప్లాట్లు కొని ఇబ్బందులు పడొద్దని హైడ్రా సూచించింది. HYD శివార్లలో ఫార్మ్ ప్లాట్ల పేరిట అమ్మకాలు జరుగుతున్నాయని, వీటిని కొన్నవారు తర్వాత ఇబ్బందులు పడాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఫార్మ్ ల్యాండ్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై నిషేదం ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో అమ్మకాలు జరుగుతున్నాయని హైడ్రాకు వచ్చిన ఫిర్యాదుల మేరకు తెలుస్తోందని కమిషనర్ రంగనాథ అన్నారు.
Similar News
News February 20, 2026
హైదరాబాద్‌లో ₹25వేల శాలరీతో జాబ్స్

ECIL HYDలో 200 పోస్టులు భర్తీ చేయనుంది. టెక్నికల్ ఆఫీసర్ ఆన్ కాంట్రాక్ట్ (TO-C) పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు BTechలో 60% మార్కుల ఉత్తీర్ణతతో పాటు వృత్తిలో అనుభవం గల అభ్యర్థులు ఫిబ్రవరి 24న ECIL HYDలో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. నెలకు ₹25,000 జీతం ఉంటుంది. మరిన్ని వివరాలకు https://www.ecil.co.in/jobopenings చూడండి.
News February 20, 2026
బాలికపై గ్యాంగ్ రేప్.. సంచలన విషయాలు

హైదరాబాద్‌లో 16 ఏళ్ల బాలికపై <<19182426>>గ్యాంగ్ రేప్<<>> ఘటనలో పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. 8వ తరగతి అమ్మాయి ఈ నెల 7న చార్మినార్‌లో షాపింగ్‌కు వెళ్లగా 16 ఏళ్ల బాలుడితో పరిచయం ఏర్పడింది. ఈ నెల 16న స్కూల్‌కు వెళ్తున్నానని చెప్పి అతడిని కలిసింది. అతడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెకు మద్యం తాగించి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని వెల్లడించారు. ఇద్దరిని అరెస్టు చేయగా, మరొకరు పరారీలో ఉన్నారు.
News February 20, 2026
4,000 నుంచి 550కి ఓలా స్టోర్లు

<<19145931>>మార్కెట్ వాటా<<>>తో పాటు డిమాండ్ తగ్గడంతో ఓలా ఎలక్ట్రిక్ తన ఫిజికల్ స్టోర్ల సంఖ్యను తగ్గించుకుంటోంది. గతంలో ఏకంగా 4,000 ఔట్‌లెట్లు ఉండగా మార్చి నాటికి 550కి తగ్గించాలని నిర్ణయించింది. ప్రస్తుతం 700 స్టోర్లు రన్ అవుతున్నాయి. సర్వీస్ క్వాలిటీని పెంచడం, ఖర్చులను తగ్గించుకోవడమే లక్ష్యంగా ఈ ‘బిజినెస్ రీసెట్’ చేపట్టింది. డిసెంబర్ క్వార్టర్‌లో కంపెనీ ఆదాయం 55% తగ్గింది. నష్టాలు ₹487Crగా నమోదయ్యాయి.


