News April 5, 2025

HYD: ఆ బస్సుల్లోనూ మహిళలకు FREE..!

image

HYDలో అనేక ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. సాధారణ బస్సుల కంటే ఎలక్ట్రిక్ బస్సులు లగ్జరీగా ఉండడంతో కొందరు ప్రయాణికులు వాటిలో మహిళలకు ఉచిత ప్రయాణం అందించే మహాలక్ష్మి పథకం వర్తించదనే అపోహ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు ఎలక్ట్రిక్ బస్సులపై మహాలక్ష్మి FREE పథకం వర్తిస్తుందని స్టిక్కర్లు అంటించారు.

Similar News

News July 10, 2025

వైభవంగా చాదర్‌ఘాట్ రేణుకా ఎల్లమ్మ కళ్యాణం

image

పసుపు కుంకుమల సంగమాన్ని తలపించిన వీధులు.. వేద పండితుల మంత్రోచ్చరణలు, భాజా భజంత్రీలు.. శివసత్తుల నృత్యాలు వెరసి భక్త జన సందోహం నడుమ చాదర్‌ఘాట్ రేణుకా ఎల్లమ్మ కళ్యాణం అంగరంగవైభవంగా జరిగింది. ఆలయ కమిటీ ఛైర్మన్ ఆరెల్లి అంజయ్య దంపతులు, కుటుంబ సభ్యులు అమ్మవారి కళ్యాణాన్ని అంగరంగ వైభంగా నిర్వహించారు. దాతలను ఆలయ కమిటీ ఛైర్మన్ అమ్మవారి శేష వస్త్రాలతో సత్కరించారు.

News July 9, 2025

బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ మేకప్ పరీక్ష ఫీజు స్వీకరణ

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఈ కోర్సు ఆరో సెమిస్టర్ మేకప్ పరీక్షా ఫీజును ఈనెల 14వ తేదీలోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని చెప్పారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.

News July 9, 2025

MBA కోర్సుల పరీక్షా తేదీల ఖరారు

image

ఓయూ పరిధిలోని MBA కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎంబీఏ (సీబీసీఎస్), ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్-డే), ఎంబీఏ (టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్) రెండో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్, ఎంబీఏ (ఈవినింగ్), ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్-ఈవినింగ్) నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలను వచ్చేనెల 5వ తేదీ నుంచి నిర్వహిస్తామన్నారు.