News March 23, 2024
HYD: ఆ సీటు కచ్చితంగా గెలవాలి: సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరిలో కాంగ్రెస్ కచ్చితంగా గెలిచి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతామహేందర్ రెడ్డితో కలిసి ఆ పార్టీ మల్కాజిగిరి, మేడ్చల్ ఇన్‌ఛార్జులతో సీఎం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మల్కాజిగిరిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని సూచించారు. ఇది తన సిట్టింగ్ స్థానమని మరోసారి గుర్తుచేశారు.
Similar News
News October 23, 2025
ఓయూలో రివాల్యుయేషన్‌కు దరఖాస్తుల ఆహ్వానం

ఓయూ ఎంసీఏ పరీక్షల ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎంసీఏ మెయిన్, బ్యాక్ లాగ్ పరీక్షల ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఒక్కో పేపర్‌కు రూ.800 చొప్పున చెల్లించి ఈనెల 27వ తేదీలోగా, రూ.200 అపరాధ రుసుముతో 29వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. జవాబు పత్రాల నకలు పొందేందుకు ఒక్కో పేపర్‌కు రూ.1,000 చొప్పున చెల్లించి 27 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News October 23, 2025
బేగంపేటలో హత్య.. మృతురాలు లీసాగా గుర్తింపు

HYD బేగంపేటలోని గ్రీన్ ల్యాండ్ ప్రాంతంలో అస్సాం రాష్ట్రానికి చెందిన <<18085139>>మహిళ హత్యకు<<>> గురైన విషయం తెలిసిందే. కాగా మృతురాలి పేరు లీసాగా పోలీసులు నిర్ధారించారు. ఈ హత్యకు సంబంధించిన అనుమానితులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. సీసీ ఫుటేజీని పరిశీలించారు. క్లూస్ టీంతో కలిసి వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్ఐ నరేశ్ తెలిపారు. ఈ హత్య కేసు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
News October 23, 2025
HYD: రోడ్లపై అసాంఘిక కార్యకలాపాలు.. మహిళల అరెస్ట్

HYD కూకట్పల్లి PS పరిధిలోని పుల్లారెడ్డి స్వీట్స్ సమీపంలో ఎస్ఐ నరసింహ ఆధ్వర్యంలో పది మంది మహిళలను అరెస్ట్ చేశారు. రోడ్లపైన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సమాచారం రావడంతో చర్యలు చేపట్టామని ఎస్ఐ తెలిపారు. పది మందిని స్థానిక ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి, సత్ప్రవర్తనలో భాగంగా బైండ్ ఓవర్ చేయగా ఇద్దరు మహిళలను 7 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించామన్నారు.