News March 18, 2025
HYD: ఇంటర్ ఎగ్జామ్ రాస్తున్న అమ్మాయికి Fits

ఇంటర్ పరీక్ష రాస్తున్న విద్యార్థిని అస్వస్థతకు గురైంది. కీసర శ్రద్ధ కళాశాలలో ఎకనామిక్ పరీక్ష జరుగుతోంది. హాల్‌కు వచ్చిన విద్యార్థిని ప్రవళిక పరీక్ష రాస్తుండగా ఫిట్స్ రావడంతో కుప్పకూలిపోయింది. అప్రమత్తమైన సిబ్బంది పక్కనే ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించి, ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నాచారం ESIకి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం ప్రవళిక ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
Similar News
News July 6, 2025
తెనాలి: టెలిగ్రామ్ యూజర్లకు డీఎస్పీ జనార్ధనరావు హెచ్చరిక

వాట్సాప్, టెలిగ్రామ్ యూజర్లు అప్రమత్తంగా ఉండాలని తెనాలి డీఎస్పీ జనార్ధనరావు సూచించారు. ‘apk’ ఫైల్స్, ప్రభుత్వ అధికారుల గ్రూపుల్లో చేరమంటూ వచ్చే సందేశాలను నమ్మవద్దని కోరారు. వీటిని డౌన్‌లోడ్ చేస్తే ఫోన్ నేరగాళ్ల వశమై, యాప్‌ల నుంచి నగదు తస్కరిస్తారని హెచ్చరించారు. మీ స్నేహితులకు మీ తరఫున మెసేజ్‌లు పంపి ఫోన్‌ను హ్యాక్ చేస్తారని తెలిపారు.
News July 6, 2025
తెలుగు పాఠ్యాంశంలో ‘సీతాకోక చిలుక’ గేయం

మహారాష్ట్ర ప్రభుత్వ బాలభారతి ఒకటో తరగతి తెలుగు వాచకంలో కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రాసిన “సీతాకోక చిలుక” గేయం పాఠ్యాంశంగా చోటు దక్కించింది. తొట్టంబేడు మండలానికి చెందిన బాల సుబ్రహ్మణ్యం ఉపాధ్యాయుడు, రచయిత, మిమిక్రీ కళాకారుడు. తన గేయం తెలుగు విద్యార్థులకు పాఠ్యాంశంగా చేరడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. పలువురు ఆయనను అభినందిస్తున్నారు.
News July 6, 2025
పల్నాడు: చుక్కల భూములపై కలెక్టర్ ఆదేశాలు

పల్నాడు జిల్లాలోని చుక్కల భూములపై జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. భూ సమస్యల సమీక్షా సమావేశంలో రెవెన్యూ అధికారులతో ఆయన చర్చించారు. నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యను వేగంగా పరిష్కరించాలని సూచించారు. భూమిపై తగిన ఆధారాలు చూపిన రైతుల భూములను 22ఎ జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.