News March 4, 2025

HYD: ఇంటర్‌ పరీక్షలు.. ఇది మీ కోసమే!

image

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఇంటర్ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. హైదరాబాద్‌లో 244, రంగారెడ్డిలో 185, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 150 కలిపి మొత్తం 579 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. మూడు జిల్లాల్లో 4,64,445 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. నగరంలోని అన్ని సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 040-29700934కు కాల్ చేయండి.
SHARE IT

Similar News

News March 4, 2025

HYDలో శిరీషను చంపి డ్రామా!

image

మలక్‌పేట జమున టవర్స్‌లో శిరీష మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెది సహజ మరణం కాదని పోస్టుమార్టం నివేదికలో తేలింది. పోలీసుల వివరాలు.. 2016లో వినయ్‌ను శిరీష ప్రేమ వివాహం చేసుకుంది. మలక్‌పేటలో దంపతులు కాపురం పెట్టారు. ఆమెపై అనుమానంతో వినయ్ వేధించేవాడు. ఈ క్రమంలోనే భార్యను చంపి, గుండెపోటుతో మరణించినట్లు చిత్రీకరించాడు. చివరకు హత్య విషయం బయటపడడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

News March 3, 2025

HYD: ‘కులగణనలో తప్పులుంటే ఆధారాలతో రండి’

image

కులగణనలో తప్పులుంటే ఆధారాలతో రండి చర్చకు సిద్ధమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ హయాంలోనే మెట్రో రైలు పనులు ప్రారంభమయ్యాయని, మెట్రో విస్తరణ కూడా కాంగ్రెస్ హయాంలోని జరుగుతుందన్నారు. ఏ కులానికి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం కాంగ్రెస్‌కు లేదన్నారు.

News March 3, 2025

HYD: 18 ఏళ్లు నిండకముందే పెళ్లి పీటల పైకి..!

image

HYD, RR,MDCL జిల్లాలో 18 ఏళ్లు నిండకముందే బాలికలు పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. బాల్య వివాహాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. పిల్లలకు త్వరగా పెళ్లి చేసి బాధ్యతలను తగ్గించుకోవాలని తల్లిదండ్రులు ఉన్నారు. బాల్య వివాహాల రద్దు కోసం ప్రభుత్వాలు బలమైన చట్టాలను తీసుకొచ్చినప్పటికీ వారికి శాపంగా మారుతుంది. మేడ్చల్లో 54, HYDలో 46, రంగారెడ్డిలో 54 బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు.

error: Content is protected !!