News September 11, 2025

HYD: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు టోల్ ఫ్రీ నంబర్

image

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల సమస్యలు, సందేహాల నివృత్తి కోసం HYDలోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం టోల్ ఫ్రీ కాల్ సెంటర్‌ను, హెల్ప్ డెస్క్‌ను మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాల్ సెంటర్ ఫోన్ నం.1800 599 5991ను ఆవిష్కరించారు. ఈ కాల్ సెంటర్ ప్రతి రోజూ ఉ. 7 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వరకు పనిచేస్తుంద‌న్నారు.

Similar News

News September 11, 2025

HYD: మ్యాన్ హోల్ ఘటనపై స్పందించిన హైడ్రా

image

పాతబస్తీలోని యాకుత్‌పురాలో మ్యాన్ హోల్‌లో పడిపోయిన చిన్నారికి ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో హైడ్రా ఊపిరి పీల్చుకుంది. బాధ్యులు ఎవరినే దానిపై ప్రాథమికంగా దర్యాప్తు చేస్తున్నామని, స్థానిక కార్పొరేటర్ ఆదేశాల మేరకు మట్టి తీసే పనిని హైడ్రా చేపట్టగా.. గట్టిగా ఉండడంతో జలమండలి మిషన్లతో తొలగించాలని నిర్ణయించారు. జలమండలి సిబ్బంది పని అయిన తర్వాత మ్యాన్ హోల్ మూత వేయకుండా వెళ్లిపోయినట్లు ప్రాథమిక సమాచారం.

News September 11, 2025

KCR పరిపాలన కోల్పోవడం దురదృష్టం: సబితారెడ్డి

image

KCR పరిపాలన కోల్పోవడం తెలంగాణ ప్రజల దురదృష్టం అని MLA సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం షాబాద్‌లో మాజీ ZPTC అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య నాయకుల, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఏ ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు వచ్చినా విజయం BRS దే అని ధీమా వ్యక్తం చేశారు. RSప్రవీణ్ కుమార్, ఆంజనేయులు, కౌశిక్‌రెడ్డి, రాజేందర్ గౌడ్, ప్రభాకర్, శ్రీధర్ రెడ్డి, నరేందర్ ఉన్నారు.

News September 11, 2025

ఖైరతాబాద్: నిరుద్యోగ సమస్యలపై మంత్రిని కలిసిన ప్రొ.కోదండరాం

image

నిరుద్యోగ సమస్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో గురువారం MLCలు ప్రొ.కోదండరాం, అద్దంకి దయాకర్ భేటీ అయ్యారు. ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని, భవిష్యత్తులో భర్తీ చేయబోయే ఉద్యోగాలపై స్పష్టమైన ప్రకటన చేస్తూ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, నిరుద్యోగుల కోసం సమగ్ర ఉపాధి కల్పన విధానాన్ని రూపొందించాలని విజ్ఞప్తి చేశారు.