News December 29, 2024
HYD: ఇందిరమ్మ ఇళ్ల సర్వే.. మీ ఇంటికి వచ్చారా..?
HYD, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే శరవేగంగా కొనసాగుతుంది. ఈ నెల 31లోగా పరిశీలన చేసి, వివరాలను యాప్‌లో నమోదు చేయాలని ఇప్పటికే అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. ఏ గ్రామంలో సర్వే చేస్తారో ముందు రోజే చాటింపు చేయాలని, ఏ ఒక్క దరఖాస్తును వదిలిపెట్టొద్దు అంటూ ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు. అధికారులు సర్వే కోసం మీ ఇంటికి వచ్చారా..? కామెంట్ చేయండి.
Similar News
News January 1, 2025
HYD: 2024లో 1,656 మంది మృతి
HYD నగరం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ట్రై కమిషనరేట్ల పరిధిలో 2024 ఏడాదిలో 10,748 ప్రమాదాలు జరగగా..1,656 మంది ప్రాణాలు కోల్పోయారు. 9,092 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. HYD, సైబరాబాద్ పరిధిలో పాదాచారులే 350 మంది మరణించడం గమనార్హం. HYD పరిధిలో 775 మంది పాదాచార్యులు ప్రమాదాల్లో గాయపడ్డట్లు వార్షిక రిపోర్టు వెల్లడించింది.
News January 1, 2025
సికింద్రాబాద్: 84 మంది పిల్లలను రక్షించిన RPF
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో 2024లో “ఆపరేషన్ స్మైల్” “ముస్కాన్” కార్యక్రమాల ద్వారా 84 పిల్లలను రక్షించారు. ఇందులో 59 బాలురు, 25 బాలికలు ఉన్నారు. రైల్వే ప్రోటెక్షన్ ఫోర్స్ (RPF), చైల్డ్ లైన్ సహా వివిధ సంస్థలు సంయుక్తంగా ఈ కార్యాచరణను చేపట్టాయి. ఈ కార్యక్రమం ద్వారా బాల కార్మికులుగా పని చేస్తున్న పిల్లలను హత్తుకు చేర్చుకున్నారు.
News January 1, 2025
HYD: JAN 3 నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు
ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభలు 2025 జనవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు హైదరాబాద్‌లోని HICC వేదికగా జరుగుతాయి. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారందరినీ ఏకం చేసి తెలుగు భాష, సంప్రదాయం, సాహిత్యం, కళలను బలోపేతం చేయడంతో పాటు వాటిని భవిష్యత్తు తరాలకు అందించే లక్ష్యంతో నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వహకులు తెలిపారు.