News December 15, 2025
HYD: ఇందిరా గాంధీలో మరో కోణం ఈ బుక్

ఇందిరా గాంధీని రాజకీయ నాయకురాలిగా మాత్రమే కాక, ప్రకృతితో ఆత్మీయ బంధం కలిగిన వ్యక్తిత్వంగా ఆవిష్కరించిన నవల ‘ఇందిరా గాంధీ: ఒక ప్రకృతి ప్రేమికురాలి జీవితం’. అధికార శిఖరంపై ఉన్నప్పటికీ పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణి సంరక్షణకు ఆమె ఇచ్చిన ప్రాధాన్యతను రచయిత సజీవంగా చిత్రించారు. రాజకీయ జీవితం- ప్రకృతి ప్రేమ మధ్య సమతౌల్యాన్ని చూపిన ఈ నవల జీవన విలువలను గుర్తుచేసే గొప్ప రచనగా నిలుస్తుంది.
Similar News
News December 16, 2025
ఎలుకల నియంత్రణకు ఇనుప తీగల ఉచ్చు

ఎలుకల నివారణకు ఈ పద్ధతి చక్కగా ఉపయోగపడుతుంది. ఇనుప తీగలు, వెదురు, తాటాకులతో తయారు చేసిన బుట్టలను ఎకరానికి 20 వరకు ఏర్పాటు చేయాలి. ఎలుకలను ఆకర్షించడానికి వాటిలో ఉల్లిపాయలు, టమాట, ఎండుచేపలు, బజ్జీలు లాంటివి ఉంచాలి. వీటిని పొలం గట్ల వెంబడి, గోదాముల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. వరిలో నారుమడి పోసిన దగ్గర నుంచి దమ్ములు పూర్తై నాట్లు వేసిన నెల వరకు.. కోతల తర్వాత ఏర్పాటు చేస్తే ఎలుకలను సమర్థంగా నివారించవచ్చు.
News December 16, 2025
వరంగల్: 3వ విడత బరిలో 1771 సర్పంచ్ అభ్యర్థులు

ఉమ్మడి WGLలో 530 పంచాయతీలకు రేపు పోలింగ్ జరగనుంది. 1771 మంది బరిలో ఉండగా, 4846కు 792 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 4054 వార్డులకు 9972 మంది బరిలో ఉన్నారు. WGLలో 305 సర్పంచ్, 1837 వార్డుఅభ్యర్థులు, HNKలో 230, వార్డులు 1424, జనగామలో 267, వార్డులు 1632, BHPLలో 296, వార్డులు 1347, ములుగులో 157 వార్డులు 863, MHBDలో 516 సర్పంచ్, వార్డులు 2869 మంది మొత్తం 1771 సర్పంచ్, 9972 వార్డు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
News December 16, 2025
కొత్త కానిస్టేబుళ్లతో నేడు సీఎం సమావేశం

AP: కొత్తగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఇవాళ సాయంత్రం నియామక పత్రాలు అందించనున్నారు. మంగళగిరి APSP ఆరోబెటాలియన్‌లో జరిగే ఈ కార్యక్రమంలో CM CBN పాల్గొననున్నారు. అభ్యర్థులతో సమావేశమై కాసేపు ముచ్చటిస్తారు. ఈ నెల 22 నుంచి 9 నెలల పాటు వారికి ట్రైనింగ్ ఉంటుంది. 2022 NOVలో 6,100 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చిన విషయం తెలిసిందే. అన్ని టెస్టులను దాటుకుని 5,757 మంది ట్రైనింగ్‌కు ఎంపిక అయ్యారు.


