News June 28, 2024

HYD: ఇందులో మీ వాహనం ఉందా..?

image

రాచకొండ కమిషనరేట్‌లోని వివిధ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో చాలాకాలంగా వదిలేసిన వాహనాలను అధికారులు‌ స్వాధీనం చేసుకున్నారు. ఏకంగా 160 వాహనాలు తమ ఆధీనంలో ఉన్నట్లు‌ అధికారులు వెల్లడించారు. వీధుల్లో వదిలేసిన‌ బైక్‌లను అంబర్‌పేటలోని హెడ్‌ క్వార్టర్స్‌లో భద్రపరిచారు. వాహనాల యజమానులు సరైన పత్రాలు చూయించి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. లేదంటే రూల్స్ ప్రకారం వేలం వేస్తామని‌ స్పష్టం చేశారు. SHARE IT

Similar News

News February 20, 2026

రాచకొండలో ‘ఈగిల్ ఫోర్స్’ తనిఖీలు.. భారీగా గంజాయి స్వాధీనం

image

రాచకొండలో ‘ఈగిల్ ఫోర్స్’ భారీ ఆపరేషన్ చేపట్టి 28 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో పాత నేరస్థుడు ఖాజా వహాబుద్దీన్‌ను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 43 కేసుల్లో నిందితుడైన ఇతడు ఒడిశా నుంచి గంజాయి తెచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. గత 20 రోజుల్లోనే ఈగిల్ ఫోర్స్ టీమ్ 225 మందిని అరెస్ట్ చేసింది.

News February 20, 2026

HYD: లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన విద్యాశాఖ అధికారులు!

image

స్కూల్ CBSE NOC ఫైల్‌ను క్లియర్ చేసేందుకు రూ. 70 వేలు లంచం డిమాండ్ చేసిన ఇద్దరు విద్యాశాఖ అధికారులను ACB రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ సూపరింటెండెంట్ సంగీత ఫణిరాజ్, రంగారెడ్డి డీఈఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ బాధితుడి నుంచి నగదు తీసుకుంటుండగా అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. నిందితులను నాంపల్లి ACB కోర్టులో హాజరుపరిచారు.