News April 17, 2025

HYD: ఇక్రిశాట్‌లో చిక్కిన చిరుత

image

HYD శివారులోని ఇక్రిశాట్ పరిశ్రమలో చిరుత పులి చిక్కింది. చిరుత పులుల ఆనవాళ్లు లభ్యం కావడంతో గత రెండ్రోజులుగా కార్మికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందడంతో బోన్లు, సీసీ కెమెరాలు బిగించారు. చిరుత కోసం బోన్‌లో రెండు మేకలను ఎరగా వేశారు. బుధవారం <<16105958>>రాత్రి మేకలను<<>> వేటాడటానికి వచ్చిన చిరుత పట్టుబడింది. చిరుతను జూపార్క్‌కు వాహనంలో తరలించినట్లు తెలుస్తోంది.

Similar News

News April 19, 2025

కడప: వచ్చి మీ ఫోన్ తీసుకెళ్లండి…!

image

కడపలో చాలా మంది తమ ఫోన్లు పొగొట్టుకున్నారు. పోలీసులు ఎంతోకష్టపడి 602 ఫోన్లు రికవరీ చేశారు. ఇందులో 275 మంది తమ మొబైల్స్ తీసుకెళ్లారు. ఇంకా 327 ఫోన్లు పోలీసుల దగ్గరే ఉన్నాయి. సరైన ఆధారాలు చూపింది వీటిని తీసుకెళ్లాలని కడప సైబర్ క్రైం పోలీసులు కోరారు. మరిన్ని వివరాలకు 08562 245490 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

News April 19, 2025

గద్వాల: నేడు సభ సజావుగా సాగుతుందా..?

image

జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలానికి మొదటిసారి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు రానున్నారు. అయితే గద్వాలలో పార్టీ ఒకటి వర్గాలు రెండు అనే విధంగా పరిస్థితి ఉందని చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా మంత్రి పర్యటన ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముగిస్తే బాగుంటుందని గద్వాల కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్గం, సరిత వర్గం పంతాలకు పోవద్దని వారు కోరుకుంటున్నారు.   

News April 19, 2025

HYDలో తరచూ కనిపిస్తున్న చిరుత

image

నగరంలోని పలు ప్రాంతాల్లో 2014 నుంచి చిరుతలు కనిపిస్తున్నాయి. మొదటిసారి 2014లో ఇక్రిశాట్లో కనిపించగా జూన్ 2019లో మళ్లీ ఇక్రిశాట్‌లో కనిపించింది. ఆ తరువాత జనవరి 2020లో కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో, డిసెంబర్ 2022లో హెటిరో డ్రగ్స్ ప్లాంట్‌లో, మే 2024లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ భూముల్లో, జనవరి 2025లో రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో.. ఇపుడు మళ్లీ ఇక్రిశాట్లో చిరుతలు కనిపించాయి.

error: Content is protected !!