News April 10, 2024

HYD: ఇడ్లీలో బల్లి.. ఓయూలో ఆందోళన

image

ఉస్మానియా యూనివర్సిటీ BED హాస్టల్ మెస్‌లో నాణ్యత ఉండడం లేదని విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. ఉదయం ఇడ్లీ తింటుంటే ప్లేట్‌లో బల్లి కనిపించడంతో ఖంగుతిన్నామన్నారు. ఆగ్రహంతో చీఫ్ వార్డెన్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. తక్షణమే తమ మెస్‌ను చీఫ్ వార్డెన్ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. సంఘటనపై విచారణ జరిపిన అధికారులు మెస్‌లోని నలుగురు సిబ్బందిని బదిలీ చేశారు.

Similar News

News April 4, 2026

రాజేంద్రనగర్‌లో హైకోర్టు భవనానికి శంకుస్థాపన

image

రాజేంద్రనగర్‌లో తెలంగాణ హైకోర్టు జోన్-II భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ పాల్గొన్నారు. రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి ఆయనకి గణస్వాగతం పలికారు. CS కె.రామకృష్ణారావు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ తదితరులు ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చారు.

News April 4, 2026

సరూర్‌నగర్: 7న జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు

image

రంగారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 7న జిల్లా స్థాయి ఫెడరేషన్ కప్ పోటీలు నిర్వహించనున్నారు. స్థానిక సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగే ఈ పోటీల వివరాలను సంఘం కార్యదర్శి గోపి వెల్లడించారు. 16 ఏళ్లు పైబడిన వారు, అలాగే అండర్-20 పురుషులు, మహిళా విభాగాల్లో ఈ క్రీడలు ఉంటాయని తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News April 2, 2026

RR: గ్రామసభలు ప్రజా సమస్యల కోసమా? ప్రచారం కోసమా?

image

గ్రామ సమస్యలు, అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం జరగాల్సిన గ్రామసభలు పక్కదారి పడుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయి సమస్యలను చర్చించాల్సింది పోయి, అధికారులు కేవలం ప్రభుత్వ పథకాలకు ‘డప్పు’ కొట్టడానికే పరిమితమవుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరుపేదలకు అందాల్సిన పథకాలు పైరవీకారుల పాలవుతున్నాయని, అధికారులు అధికార పక్షానికి వత్తాసు పలుకుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు.