News October 10, 2025
HYD: ఇది కదా..! నిజమైన దేశభక్తి

మన నగరంలోని వీధులు, రోడ్లు చెత్త కాగితాలతో అపరిశుభ్రంగా కనిపిస్తుంటాయి. ఒకవైపు కేంద్రం స్వచ్ఛభారత్ తెచ్చినా క్షేత్రస్థాయిలో నీరుగారిపోతోంది. ఎవరికి తోచినట్లు వారు కనీస బాధ్యతను మరిచి ప్రవర్తిస్తుంటారు. కానీ ఫిలింనగర్‌లో ఈ విద్యార్థి చదువు నేర్పిన బుద్ధితోనేమో తాను ఉపయోగించిన కవర్లను రోడ్డు పక్కన ఉన్న డస్ట్‌బిన్లలో వేస్తూ కనిపించాడు. ‘ఇది కదా నిజమైన దేశభక్తి అంటే’ అని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
Similar News
News October 10, 2025
జూబ్లీహిల్స్‌లో హిందువులకు రక్షణ లేదు: BJP

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో హిందువులకు రక్షణ లేదని BJP స్టేట్ చీఫ్ రాంచందర్ రావు అన్నారు. శుక్రవారం నాంపల్లిలోని ఆఫీస్‌లో పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఎర్రగడ్డలో నివాసాల మధ్య శ్మశానవాటిక కోసం 2 ఎకరాల స్థలం ఇవ్వడం ఏంటని ప్రభుత్వాన్ని నిలదీశారు. జూబ్లీహిల్స్‌లో గుడులను కూల్చుతున్నారని, హిందువుల మీద దాడులు ఏంటని రాంచందర్ నిలదీశారు. BJPతోనే అభివృద్ధి అంటూ ఆయన పేర్కొన్నారు. దీనిపై మీ కామెంట్?
News October 10, 2025
Political Trend: జూబ్లీహిల్స్ BJP అభ్యర్థిగా BRS!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముంగిట సిటీ పాలిటిక్స్‌లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. BJP అభ్యర్థి INC నుంచి పోటీ చేస్తాడని BRS నేతలు సెటైర్లు వేశారు. కౌంటర్‌గా BJP అభ్యర్థి కూడా BRS నుంచేనని TPCC లీడర్ సామ రామ్మోహన్ ట్వీట్ చేశారు. ‘కారు గుర్తుకు ఓటు కమల బలోపేతం కోసం.. BJP కార్యకర్తలు, BRS మైనారిటీ నేతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు’ అని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే BRS-INC ఒక్కటే అని BJP ఆరోపిస్తోంది.
News October 10, 2025
HYD: 8 ఏళ్ల బాలికపై అత్యాచారం

సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణం జరిగింది. 8 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. నిందితుడు గంజాయి మత్తులో బాలిక సోదరుడి ముందే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. చిన్నారి అనారోగ్యానికి గురి అవడంతో తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. బాధితురాలి తల్లి సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.