News October 23, 2025
HYD: ఇద్దరు పిల్లలు మృతి.. తల్లడిల్లిన తల్లి

హైదరాబాద్ శివారులోని సాగర్ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం తమ్మలోనిగూడ గేటు వద్ద ట్రాక్టర్ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రికి గాయాలు అయ్యాయి. ఇద్దరు పిల్లలు అభిరామ్(9), రామ(5) అక్కడికక్కడే మృతి చెందారు. రక్తపు మడుగులో ఉన్న పిల్లలను చూసి తల్లి కన్నీరుమున్నీరైంది. ఈ దృశ్యం చూసిన స్థానికులు చలించిపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News October 23, 2025
GNT: నానో టెక్నాలజీ పరీక్షా ఫలితాల విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జులై నెలలో జరిగిన I, V ఇయర్స్ నానో టెక్నాలజీ సెకండ్ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను గురువారం వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు విడుదల చేశారు. ఫలితాల రీవాల్యుయేషన్ కోసం నవంబర్ 3వ తేదీలోపు ఒక్కో సబ్జెక్టుకు రూ.1860/- నగదు చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు వర్సిటీలోని సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు.
News October 23, 2025
నంద్యాల జిల్లా స్పోర్ట్స్ హాస్టల్‌లో ప్రవేశాలకు క్రీడా పోటీలు

నంద్యాల జిల్లాస్థాయి క్రీడా పోటీలను పద్మావతి నగర్‌లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈనెల 29, 30వ తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి ఎంఎన్వీ రాజు తెలిపారు. జిల్లాలోని 5 నుంచి 8వ తరగతి చదువుతున్న బాలురు, బాలికలు 17 క్రీడాంశాలలో పాల్గొనవచ్చన్నారు. ఎంపికైన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లా స్పోర్ట్స్ హాస్టల్‌లో ఉచిత వసతి, భోజనం, అత్యున్నత శిక్షణ కల్పిస్తామన్నారు.
News October 23, 2025
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం

భీమడోలులో గురువారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాం లభ్యమైంది. జాతీయ రహదారి ఎన్‌హెచ్ 16 కురెళ్ళగూడెం నుంచి భీమడోలు వైపు వెళ్లే రోడ్డు మార్గం పక్కన మృతదేహం ఉన్నట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి సుమారు 30-40 సంవత్సరాల వయసు ఉంటుందన్నారు. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న భీమడోలు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు స్టేషన్‌లో సంప్రదించాలన్నారు.