News August 13, 2025
HYD: ఇస్రో ఛైర్మన్‌కు డాక్టరేట్: VC కుమార్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ డాక్టర్ వి.నారాయణన్‌కు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ను ప్రకటించింది. ఈనెల 19న జరగనున్న ఓయూ 84వ స్నాతకోత్సవంలో ఓయూ కులపతి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా డాక్టరేట్ (డాక్టరేట్ ఆఫ్ సైన్స్) అందించనున్నట్లు ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం తెలిపారు. ఇస్రో ఛైర్మన్‌కు డాక్టరేట్ ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు.
Similar News
News August 14, 2025
గోల్కొండలో పంద్రాగస్టు వేడుకలు.. ఈ రూట్‌లో రాకపోకలు బంద్

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకు గోల్కొండ కోటలో వేడుకలు జరగనున్నాయి. పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాందేవ్‌గూడ నుంచి గోల్కొండ కోట వరకు వాహనాల రాకపోకలను నిలిపివేస్తారు.
SHARE IT
News August 14, 2025
SR నగర్: డ్రంక్ & డ్రైవ్‌లో పట్టుబడిన వారికి జైలు శిక్ష

SR నగర్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో ఈనెల 6న పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ముగ్గురు ప్రైవేటు ట్రావెల్స్ డ్రైవర్లు చిక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఐ శ్రీనివాసులు రెడ్డి, ఎస్ఐ నాగరాజు మాట్లాడుతూ.. బస్సు డ్రైవర్లను బుధవారం నాంపల్లి కోర్టు 12 జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచామని వెల్లడించారు. వారికి రెండు రోజుల జైలు శిక్ష, రూ.2,100 జరిమానా విధించారని పేర్కొన్నారు.
News August 13, 2025
అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి: హైదరాబాద్ కలెక్టర్

మాదకద్రవ్యాల నిర్మూలన కోసం పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హరిచందన అధికారులకు సూచించారు. బుధవారం నాంపల్లిలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని,మాదక ద్రవ్యాల వినియోగంతో జరిగే నష్టాలను వివరిస్తూ, నివారించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలన్నారు.