News November 16, 2024
HYD: ‘ఈనెల 16న కలెక్టరేట్లు, ఆర్‌డీఓ, తహశీల్దార్ కార్యాలయాల ముట్టడి’
రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈనెల 16న కలెక్టరేట్లు, ఆర్‌డీఓ, తహసీల్వార్ కార్యాలయాలను ముట్టిడిస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. శుక్రవారం కాచిగూడ హోటల్‌లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల స్కాలర్‌షిఫ్‌లను రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు పెంచాలని అన్నారు.
Similar News
News November 16, 2024
HYD: MNJ డాక్టర్ కీలక సూచన
HYD ప్రజలకు MNJ ఆసుపత్రి డాక్టర్ శ్రీనివాస్ క్యాన్సర్ రాకుండా ఉండేందుకు సూచనలు చేశారు. అధిక శాతంగా ఉప్పు, పదేపదే వేయించిన పదార్థాలు, జంక్ ఫుడ్ తీసుకోవడం, పొగ, మద్యం గుట్కా, కైనిమసాలా, పాన్ నమలటం లాంటి అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. బరువు నియంత్రణలో పెట్టుకోవాలని, రెడ్ మీట్ బదులుగా చికెన్, చేపలు, గుడ్లు తీసుకోవడం మంచిదని సూచించారు.
News November 16, 2024
కోటి దీపోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి దంపతలు
సీఎం రేవంత్‌రెడ్డి కోటి దీపోత్సవంలో పాల్గొన్నారు. సమాజం అంతా సుఖశాంతులతో ఉండాలని, ఇలాంటి పూజ కార్యక్రమం చేపట్టడం సంతోషకరం అని తెలిపారు. కార్తీకమాసం వస్తే శివయ్య భక్తులు హైదరాబాద్ వైపు చూసేలా ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం అని, ఆ పరమేశ్వరుడి ఆశీస్సులతో తెలంగాణకు మేలు జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు.
News November 15, 2024
HYD: హౌస్ మోషన్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు
కొడంగల్ మాజీ MLA పట్నం నరేందర్ రెడ్డి హౌస్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. పట్నం నరేందర్ రెడ్డిని ప్రత్యేక బ్యారక్‌లో ఉంచాలని దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించింది. కాగా, లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి ఘటనలో భాగంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న విషయం తెలిసిందే.