News June 15, 2024
HYD: ఈనెల 17న ప్రజావాణి లేదు: GHMC కమిషనర్

HYD ఖైరతాబాద్‌లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈనెల 17న ఉండదని GHMC ఇన్‌ఛార్జ్ కమిషనర్ ఆమ్రపాలి ఈరోజు తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించినందున ప్రజావాణి ఉండదని ఆమె స్పష్టం చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆమె కోరారు.
Similar News
News July 6, 2025
బోరబండలో భార్యను హత్య చేసిన భర్త

HYD బోరబండ PS పరిధిలో భార్యను భర్త హత్య చేశాడు. స్థానికులు తెలిపిన వివరాలిలా.. సోనీ, నర్సింలు దంపతులు. మద్యానికి బానిసై నర్సింలు తాగివచ్చి తరుచూ చిత్రహింసలకు గురి చేసేవాడు. ఈ నేపథ్యంలో భార్య సోనీ తన పుట్టింటికి వెళ్లింది. తిరిగి వచ్చిన తర్వాత 3 రోజులుగా మళ్లీ చిత్రహింసలు పెడుతూ విచక్షణారహితంగా కొట్టడంతో సోనీ మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News July 6, 2025
HYD: నేడు సాలార్ జంగ్ మ్యూజియానికి సెలవు

మొహరం నేపథ్యంలో బీబీ కా ఆలం ఊరేగింపులో భాగంగా నేడు HYDలోని సాలార్ జంగ్ మ్యూజియానికి సెలవు ఉంటుందని మ్యూజియం అడ్మినిస్ట్రేటివ్ అధికారి తెలిపారు. అదేవిధంగా బీబీ కా ఆలం ఊరేగింపు చార్మినార్ ప్రధాన మార్గాల్లో కొనసాగనున్న నేపథ్యంలో చార్మినార్‌లోకి ప్రవేశం ఉండదన్నారు. సోమవారం తిరిగి సాలార్ జంగ్ మ్యూజియంలోకి ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు.
-SHARE IT
News July 6, 2025
HYD: మొహరం స్పెషల్.. బీబీ కా అలమ్ గురించి తెలుసా..!

బీబీ కా ఆలం హైదరాబాద్‌లోని ప్రముఖ శియా ముస్లిం పవిత్ర ధ్వజం(అలమ్)గా ప్రసిద్ధి చెందింది. ఇది ప్రతి సంవత్సరం మొహరం నెలలో, ముఖ్యంగా ఆశురా రోజున వైభవంగా జరిగే ఊరేగింపులో ప్రజల దర్శనార్థం ఉంచుతారు. ఈ అలమ్‌ను ఖాసా అలంకరించిన ఏనుగుపై ఊరేగించడం అనేది కుతుబ్ షాహీ, ఆసఫ్ జాహీ పరిపాలన కాలం నాటి సంప్రదాయం. దీన్ని బీబీ ఫాతిమా(ప్రవక్త మహమ్మద్ కుమార్తె) స్మృతిగా భావిస్తారు.