News March 4, 2025
HYD: ఈనెల 6న తెలంగాణ మంత్రివర్గ సమావేశం

బడ్జెట్ సమావేశాలు దగ్గర పడుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. అందుకోసం ఈనెల 6న కేబినెట్ మీటింగ్ నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం ఈ సమావేశం జరగనుంది. కాగా ఈ సమావేశంలో ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ అంశాలను చర్చించనున్నారు.
Similar News
News March 4, 2025
GEFI & శ్రీ అన్నపూర్ణ ఫుడ్స్ జాయింట్ వెంచర్

HYDకు చెందిన జెమిని ఎడిబుల్స్& ఫ్యాట్స్, కోయంబత్తూరుకు చెందిన మసాలా బ్రాండ్ శ్రీ అన్నపూర్ణ ఫుడ్స్ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. ఈ మేరకు మంగళవారం ప్రెస్‌మీట్‌లో సంస్థల ప్రతినిధులు ప్రకటించారు. బ్రాండింగ్& పంపిణీకి రూ.70 కోట్లు, రాబోయే రెండేళ్లలో మరో రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో చంద్రశేఖర రెడ్డి, విజయ్ ప్రసాద్, అక్షయ్ చౌదరి, తదితరులు పాల్గొన్నారు.
News March 4, 2025
మహిళలను గౌరవించే చోట దేవతలు కొలువై ఉంటారు: సీపీ

మహిళలను గౌరవించే చోట దేవతలు కొలువై ఉంటారని రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాచకొండ కమిషనరేట్, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నాగోల్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ కమిషనరేట్ విభాగాల పోలీసు మహిళా అధికారులు పాల్గొన్నారు.
News March 4, 2025
HYD: రాయదుర్గంలో యువతి సూసైడ్

రాయదుర్గంలో విషాద ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాలు.. వికారాబాద్ జిల్లాకు చెందిన దేవిక(25), సతీశ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. రాయదుర్గంలో కాపురం పెట్టారు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఆదివారం మరోసారి వాగ్వాదం పెట్టుకున్నారు. ఈ మనస్తాపంతో దేవిక ఉరివేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.