News October 21, 2025

HYD: ఈవీ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రత్యేక డ్రైవ్

image

ఈవీ స్టేషన్ల ఏర్పాటును ప్రోత్సహించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రత్యేక డ్రైవ్‌ను మొదలు పెట్టిందని ఎండీ ముషారఫ్ ఫారుకి తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయ పార్కింగ్ ప్రదేశాలను ఎండీ పరిశీలించారు. అక్కడ విద్యుత్ వాహన పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు (EV PCS) ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించారు. ఈవీ స్టేషన్ల ఏర్పాటుకు 70 నుంచి 100 శాతం వరకు సబ్సిడీ ఇస్తున్నట్లు చెప్పారు.

Similar News

News October 22, 2025

కార్తీకం: ఆకాశ దీపం అంటే?

image

కార్తీక మాసంలో దేవాలయాల్లో ధ్వజ స్తంభానికి ‘ఆకాశ దీపం’ ఏర్పాటుచేస్తారు. చిన్న రంధ్రాలున్న ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనెపోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. ఇంటి దగ్గర తులసికోట పక్కన పొడవైన కొయ్యదీప స్తంభానికి దీపాన్ని వెలిగిస్తారు. దీని వెలిగించడం వల్ల అపార జ్ఞానం సిద్ధిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఆకాశ దీపం పితృదేవతలకు దారి చూపుతుందని, దీనివల్ల వారు దివ్యలోకాలను పొందుతారని వివరిస్తున్నాయి.

News October 22, 2025

పొద్దున నిద్ర లేవగానే ఇలా చేస్తే.. అన్నీ శుభాలే!

image

ఉదయం నిద్ర లేవగానే కొన్నింటిని దర్శిస్తే ఆ రోజంతా శుభాలు కలుగుతాయి. అరచేతుల్లో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి పొద్దున్నే వాటిని చూసుకోవాలని పండితులు చెబుతున్నారు. శాస్త్రాల ప్రకారం.. తులసి మొక్కను చూస్తే, ముల్లోకాలలోని పవిత్ర తీర్థాలలో స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. గోవు, అగ్నిహోత్ర దర్శనం కూడా మంచి ఫలితాలనిస్తుంది. ఈ నియమాలను పాటిస్తే.. ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని పండితులు సూచిస్తున్నారు.

News October 22, 2025

రైలు నుంచి జారిపడిన వ్యక్తి

image

మంత్రాలయం రైల్వే స్టేషన్ వద్ద తమిళనాడుకు చెందిన వ్యక్తి రైలు నుంచి జారిపడి రెండు కాళ్లు పోయాయి. స్పందించిన రైల్వే పోలీసులు వెంటనే అంబులెన్స్‌లో ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. బతుకుదెరువు కోసం సోలాపూర్ వెళ్లి తిరిగి మధురై వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపినట్లు సమాచారం.