News April 7, 2025
HYD: ఈషాసింగ్‌ను అభినందించిన సీఎం

అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ కప్‌లో 25 మీటర్ల మహిళల పిస్టల్ ఈవెంట్‌లో హైదరాబాద్‌కు చెందిన ఈషా సింగ్ రజత పతకం సాధించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆమెకు అభినందనలు తెలిపారు. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్‌లో ఈషా సింగ్‌కు ఇది మొదటి పతకం కాగా ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్‌లో ఇది దేశానికి మూడో పతకం.
Similar News
News April 13, 2025
HYD: అశ్లీల చిత్రాలు చూస్తున్నారా? జాగ్రత్త..!

సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూసినా, ఇతరులకు షేర్ చేసినా శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని HYD టప్పాచబుత్రా పోలీసులు Xలో పోస్ట్ చేశారు. ఇటీవల HYD శివారు మిరుదొడ్డిలో యువకుడు అశ్లీల చిత్రాలు చూస్తూ SMలో పోస్ట్ చేశాడు. గుర్తించిన సైబర్ సెక్యూరిటీ అధికారులు అతడిని రిమాండ్ చేసి.. ఫోన్, సిమ్ స్వాధీనం చేసుకున్నారని అందులో పేర్కొన్నారు. లైక్‌ల కోసం వీటిని పోస్ట్ చేయొద్దని, SMని మంచికోసం వాడాలని సూచించారు.
News April 13, 2025
Orange: HYDలో సరిపోయింది ఈ శనివారం

ఈ శనివారం HYD వాసులకు గుర్తుండిపోయే రోజు. వీర హనుమాన్ విజయయాత్ర జరిగిన నగరంలోనే ఆరెంజ్ ఆర్మీ జైత్ర యాత్ర కొనసాగింది. ఉదయం నుంచి ఓ ఆర్మీ జై శ్రీరామ్ నినాదాలతో HYDను హోరెత్తించగా.. మరో ఆర్మీ ఉప్పల్ స్టేడియంలో చెలరేగిపోయింది. ఎటు చూసినా కాషాయజెండాలే దర్శనమిచ్చాయి. భక్తుల పూజలు, హనుమంతుడి అనుగ్రహంతో ఆరెంజ్ ఆర్మీ ఘన విజయం సాధించిందని హైదరాబాద్ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
News April 13, 2025
HYD: ప్రశాంతంగా ముగిసిన యాత్ర

నగరంలో శ్రీ వీర హనుమాన్ విజయయాత్ర శాంతియుతంగా ముగిసింది. ఏకంగా 17,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సీపీ సీవీ ఆనంద్ పర్యవేక్షణలో డ్రోన్‌లు, సీసీటీవీలతో పర్యవేక్షణ జరిగింది. 45 ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు, జాయింట్ కంట్రోల్ రూమ్ ద్వారా అన్ని శాఖల సమన్వయంతో యాత్ర నిర్వహించారు. ప్రజలు, నిర్వాహకుల సహకారంతో యాత్ర ప్రశాంతంగా ముగిసిందని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.