News April 7, 2025
HYD: ఈషాసింగ్ను అభినందించిన సీఎం

అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ కప్‌లో 25 మీటర్ల మహిళల పిస్టల్ ఈవెంట్లో హైదరాబాద్‌కు చెందిన ఈషా సింగ్ రజత పతకం సాధించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆమెకు అభినందనలు తెలిపారు. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్‌లో ఈషా సింగ్‌కు ఇది మొదటి పతకం కాగా ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్‌లో ఇది దేశానికి మూడో పతకం.
Similar News
News December 30, 2025
పరిశ్రమల ఏర్పాటుకు సత్వర చర్యలు చేపట్టాలి: కలెక్టర్

జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చే పారిశ్రామికవేత్తలను అన్ని రకాలుగా ఆయా శాఖల అధికారులు ప్రోత్సహించాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్ఠం చేసేలా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించాలన్నారు. వారికి సకాలంలో సింగల్ డెస్క్ పోర్టల్ ద్వారా అన్ని అనుమతులు అందజేయాలన్నారు.
News December 30, 2025
విజయవాడలో ‘న్యూ ఇయర్’ ఆంక్షలు

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరంలో పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. 31వ తేదీ రాత్రి బెంజ్ సర్కిల్, కనకదుర్గ ఫ్లైఓవర్ సహా అన్ని వంతెనలను మూసివేస్తున్నట్లు సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. శాంతిభద్రతల దృష్ట్యా ఈ నిబంధన జనవరి 13 వరకు రాత్రి వేళల్లో అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని వెల్లడించారు.
News December 30, 2025
ఫలించిన RBI ప్లాన్.. పుంజుకున్న ‘రూపాయి’

డాలరుతో రూపాయి మారకం విలువ నేడు 14పైసలు లాభపడి రూ.89.84కు చేరింది. రిజర్వ్ బ్యాంక్ డాలర్లను విక్రయించడంతో రూపాయి కాస్త బలపడింది. పారిశ్రామిక ఉత్పత్తి భారత కరెన్సీ బలపడటానికి సపోర్ట్‌గా నిలిచినప్పటికీ బలమైన డాలర్, అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు, ఫారిన్ ఫండ్స్ ప్రవాహం మరింత బలపడకుండా అడ్డుకున్నాయి. రూ.89.98 వద్ద మొదలైన ట్రేడింగ్ ఒక దశలో 89.72కు చేరినా చివరకు 89.84 వద్ద ముగిసింది.


