News February 10, 2025

HYD: ఈ గేట్లతో.. ఇక క్లియరెన్స్ చాలా ఈజీ..!

image

HYD శంషాబాద్ విమానాశ్రయంలో ఇక అంతర్జాతీయ ప్రయాణం సులభతరం మారిందని అధికారులు తెలిపారు. ఈ-గేట్లను ఏర్పాటు చేసి బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా ప్రీ వెరిఫైడ్ ప్రయాణికులకు ఫాస్ట్ క్లియరెన్స్ ఇస్తున్నట్లుగా తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్, ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రాం ద్వారా అంతర్జాతీయ ప్రాంతాలకు వలస వెళ్లే వారికి సైతం మేలు కలగనుంది.

Similar News

News September 17, 2025

సిరిసిల్ల: సాయుధ పోరాట యోధుడు బద్దం ఎల్లారెడ్డి

image

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బద్దం ఎల్లారెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకునే రోజుల్లోనే స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. 1930లో కాకినాడ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఏడు నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అగ్ర నాయకుడిగా కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో అరెస్టు అయి మూడేళ్లు జైలులో ఉన్నారు. ప్రజల కోసం నిరంతరం పోరాడిన ఈ యోధుడు 1978 డిసెంబర్ 27న మరణించారు.

News September 17, 2025

24న శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల

image

AP: డిసెంబర్ కోటాకు సంబంధించి తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు ఈనెల 24న ఉదయం 10గంటలకు విడుదల కానున్నాయి. మ.3 గంటలకు అదే నెలకు సంబంధించిన వసతి బుకింగ్ కూడా ఓపెన్ కానుంది. భక్తులు దళారులను నమ్మవద్దని, <>ttdevasthanams.ap.gov.in<<>> వెబ్‌సైట్ లేదా యాప్‌లోనే బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

News September 17, 2025

సిరిసిల్ల : తొలితరం పోరాట యోధుడు రావుల నరసింహ రెడ్డి

image

తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన తొలితరం యోధుడు రావుల నరసింహ రెడ్డి. రాజన్న సిరిసిల్లి జిల్లా కోనరావుపేట మండలం కనగర్తి గ్రామానికి చెందిన ఈయన 1949 ప్రాంతంలో ప్రజల కష్టాలను చూసి పోరాటంలో భాగమయ్యారు. పేదల కోసం అనేక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. సిరిసిల్ల ప్రాంత ప్రజలు ఇప్పటికీ ఆయనను ఒక గొప్ప వీరుడిగా గుర్తుంచుకుంటారు.